ప్రాణహాని ఉందని మధ్యాహ్నమే ఫిర్యాదు: రాత్రి జగిత్యాలలో తుపాకీతో కాల్చి వ్యక్తి హత్య
జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
మృతుడిని హైదరాబాదులోని ముషీరాబాద్‌కు చెందిన సత్యనారాయణ గౌడ్‌గా గుర్తించారు. అతను ఓ కాంట్రాక్టర్ అని కూడా తెలుస్తోంది.
అతను పండుగ కోసం దర్మపురి వెళ్లాడు. అక్కడ అతనిపై కాల్పులు జరగడంతో అక్కడికి అక్కడే మృతి చెందాడు. తనకు ప్రాణహానీ ఉందని మృతుడి మధ్యాహ్నమే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.













Click it and Unblock the Notifications