కుషాయిగూడ ఈసీనగర్‌లో కాల్పుల కలకలం, ఇద్దరికి గాయాలు
నగరంలోని కుషాయిగూడ పరిధిలో ఉన్న ఈసీనగర్‌లో శుక్రవారం తుపాకీ కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. కూరగాయల మార్కెట్ స్థలం వివాదంలో బీహార్‌కు చెందిన వ్యక్తులకు, స్థానికులకు మధ్య ఘర్షణ ఈ కాల్పులకు దారితీసిం
హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడ పరిధిలో ఉన్న ఈసీ నగర్‌లో శుక్రవారం తుపాకీ కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. కూరగాయల మార్కెట్ స్థలం వివాదంలో బీహార్‌కు చెందిన వ్యక్తులకు, స్థానికులకు మధ్య ఘర్షణ ఈ కాల్పులకు దారితీసింది.
ఈ ఘర్షణలో బీహార్‌కు చెందిన గజరాజ్ సింగ్ తపంచా తీసి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో మౌలాలికి చెందిన ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.

కాల్పుల సమాచారం అందగానే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాల్పులకు పాల్పడిన గజరాజ్ సింగ్‌ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అతడి ఇంట్లోంచి మరో నాలుగు తపంచాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications