టీఆర్ఎస్ ఎంపీ అల్లుడితో గన్‌మెన్లు టిక్ టాక్ .. వీడియో వైరల్

ఇప్పుడు దేశ వ్యాప్తంగా టిక్ టాక్ మేనియా విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడకు వెళ్ళినా ఏం చేసినా తమలో ఉన్న టాలెంట్ మాత్రం టిక్ టాక్ వీడియోలలో చూపిస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఏదో టైం పాస్ కి చేసే ఈ టిక్ టాక్ వీడియోలను ప్రభుత్వోద్యోగులు పని మానేసి మరీ చేస్తున్న తీరు చర్చకు కారణం అవుతుంది. టిక్ టాక్ ఎంటర్టైన్మెంట్ అందించడమే కాకుండా పలు విమర్శలకు కూడా కారణమవుతుంది.

ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఆఫీసుల్లో పని మానేసి టిక్ టాక్ వీడియోలు తీసి వాటిని అప్లోడ్ చేస్తుండడం గమనిస్తున్నాం. తాజాగా ఏకంగా టీఆర్ఎస్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ బండ ప్రకాష్‌ గన్‌మెన్లు ఆయన అల్లుడితో కలిసి టిక్‌టాక్‌ల్లో మునిగి తేలడం ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది. ఎంపీ గన్ మెన్లు చేసిన టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ కారణమవుతుంది. వరంగల్ రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్‌ అల్లుడు జగన్‌కు గన్‌మెన్లుగా యాక్షన్ చేస్తూ వీడియోలకు ఫోజులిచ్చారు. అనంతరం ఆ వీడియోలను జగన్ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు.

Gunmen tik tok with TRS MP son in law .. Video goes viral

పులిచింతల ప్రాజెక్టు సందర్శిస్తున్న క్రమంలో ఎంపీ కి భద్రత గా ఉండాల్సిన గన్‌మెన్లు ఆయన భద్రతను గాలికి వదిలేసి, బండ ప్రకాశ్ అల్లుడి జగన్ తో కలిసి వీడియోలు చిత్రీకరణలో మునిగిపోయారు. స్లో మోషన్ లో రాజ్య సభ సభ్యుడు బండా ప్రకాష్ అల్లుడు జగన్ నడిచి వస్తుండగా ఆయనకు సెక్యూరిటీగా ఉన్నట్టు వీడియో చిత్రీకరించారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. గన్‌మెన్లు చేసిన నిర్వాకంపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పని మానేసి టిక్ టాక్ వీడియోలు చేస్తున్న వైనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+