ఆధ్యాత్మికత పేరుతో మహిళకు వల.. గురూజీపై కేసు నమోదు..

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ లో ఆధ్మాత్మిక‌త పేరుతో ఓ మ‌హిళ‌ను వేధింపుల‌కు గురి చేశాడు ఓ గురూజీ. జూబ్లీహిల్స్ రోడ్ నం.71 లో శ్రీవిద్యా సాధనా సెంటర్‌ ను నిర్వహిస్తున్న శ్రీ చైతన్య గురూజీ అలియాస్ మేరెడ్డి సునీల్‌ రెడ్డిపై ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

శ్రీవిద్యా సాధనా సెంటర్‌ కు సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ విష్ణుదీప్‌ రెడ్డి భార్య వెళ్తుండగా.. ఆధ్యాత్మిక సాధనల పేరుతో గురూజీ సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆమెకు అసభ్య సందేశాలు పంపించడమే కాకుండా వ్యక్తిగత చాటింగ్‌ చేశాడు గురూజీ సునీల్‌ రెడ్డి. అయితే తన భార్య తనను దూరం పెడుతున్నట్లు గ్రహించిన ఆమె భర్త విష్ణుదీప్‌ రెడ్డి.. ఈ మేరకు గురూజీని నిలదీశాడు.

Guruji Woman lured in name of spirituality in Hyd police register case against Sri Chaitanya Guruji

అయితే గురూజీ సునీల్‌ రెడ్డి నుంచి ఇంజినీర్ భార్య విష్ణుదీప్‌ రెడ్డికి హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో చాటింగ్ ఆధారాలు, బెదిరింపుల వివరాలతో కోర్టును ఆశ్ర‌యించాడు బాధితుడు. గురూజీ తన వైవాహిక జీవితంలో గందరగోళం సృష్టించాడని.. ఈ మేరకు చాటింగ్ ఆధారాలు, బెదిరింపుల వివరాలను కోర్టుకు సమర్పించాడు. దాంతో కోర్టు ఆదేశాలతో BNS 351(2) సెక్షన్ కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈమేరకు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఆధ్యాత్మికత పేరుతో ఇలాంటి పనులకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఇలాంటి బాబాలు, గురూజీల ఘటనలు అధికం అవుతున్న సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+