Jailer 2 Twitter Review: రజినీకాంత్ 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ..
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటేనే థియేటర్లలో పండగ వాతావరణం ఉంటుంది. 2023 లో జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రజనీకాంత్ ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ అయిన జైలర్ 2 మూవీతో వస్తున్నారు. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్ లో బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. బుక్ మై షో యాప్ లో గంటకు 32 వేల టికెట్స్ బుకింగ్ అవుతున్నాయి. రిలీజ్ కు ముందే ఈ రేంజ్ హైప్ ఉంటే ఇక రిలీజ్ తర్వాత మూవీ ఇంకెంత రేంజ్ లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు జైలర్ 2 ట్విట్టర్ రివ్యూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ మూవీకి ట్విట్టర్ మాధ్యమంలో పాజిటివ్ రెస్పాన్స్ లు వస్తున్నాయి.
జైలర్ 2 మూవీకి రేటింగ్ ఐదుకు ఏకంగా నాలుగు ఇస్తున్నారు. మూవీ బ్లాక్ బస్టర్ అని అవుట్ స్టాండింగ్ అని మాట్లాడుకుంటున్నారు. ఎలాంటి డౌట్ లేకుండా రజనీకాంత్ కెరీర్ లోనే ఇది బెస్ట్ సినిమా అని ప్రశంసిస్తున్నారు. అలాగే 2026 లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్స్మ్ అని టాక్ వినిపిస్తోంది. సూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని కామెంట్స్ పెడుతున్నారు.
#Jailer2 - BLOCKBUSTER OUTSTANDING.Rating: ⭐⭐⭐⭐ 4/5 !!Lives up to the mammoth expectations... This is, without doubt, the BEST FILM of @rajinikanth and also among the BEST FILMS of 2026... SURE-SHOT BLOCKBUSTER. #Jailer2Review #Jailer https://t.co/c7nZp1dlMr
— its cinema (@itscinemaoficl) October 14, 2026
#Jailer2 Very good inside reports 💥👍 Hope it connects with the audience too👍
— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) October 14, 2026
మరో యూజర్ మాట్లాడుతూ.. దర్శకుడు నెల్సన్ జైలర్ 2 చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని.. జైలర్ 3 కు లీడ్ గా చివరగా విజయ్ సేతుపతిని ఇంట్రడ్యూజ్ చేస్తూ మూవీ ఎండ్ అవుతుందని తెలిపాడు. అలాగే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఐదు నిమిషాల పాటు కనిపిస్తారని సమాచారం. మోహన్ లాల్ పాత్ర తక్కువగా ఉంటుందని.. శివన్న పాత్ర ఎక్కువగా ఉంటుందని కామెంట్ పెట్టాడు. థియేటర్లలో ఈ సినిమా విధ్వంసమేనని చివరగా ఆయన రాసుకొచ్చారు.

మరో యూజర్ మాట్లాడుతూ.. జైలర్ 2 లో రజినీకాంత్ సీక్వెన్స్ అద్దిరిపోయిందని అన్నారు. తమిళనాడులోని దాదాపు అన్ని థియేటర్లలో డే 1, డే 2 హౌజ్ ఫుల్స్ అయినట్లు కామెంట్స్ లో వివరించాడు. మరొకరు.. వన్ మూన్.. వన్ సన్.. వన్ రజనీకాంత్ అని కామెంట్ చేశాడు. ఇక జైలర్ 2 మూవీ మరికొద్దిగంటల్లో విడుదల నేపథ్యంలో కోలీవుడ్ హీరో ధనుష్.. తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో కీలక పోస్టు పెట్టారు. తలైవార్ దర్శనం రేపు అని రాసుకొచ్చారు. ఇక జైలర్ 2 మూవీలో రజినీకాంత్ ముత్తువేల్ పాండియన్ గా కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నాతో పాటు ఎస్. జే. సూర్య, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజారమూడు కీలక పాత్రల్లో నటించారు.












Click it and Unblock the Notifications
