ఎమ్మెస్సార్ ముసలితనంలో ఉన్నారు: కెసిఆర్‌ను ప్రశంసించడంపై గుత్తా
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును తమ పార్టీ సీనియర్ నేత ఎం. సత్యనారాయణరావు ప్రశంసించడాన్ని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యతిరేకించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన బాగుందంటూ ఎమ్మెస్సార్ శుక్రవారంనాడు మెచ్చుకున్నారు. దానిపై గుత్తా సుఖేందర్ రెడ్డి శనివారం మీడియా ప్రతినిధుల వద్ద స్పందించారు.
ఎమ్మెస్సార్ వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. ఎమ్మెస్సార్ క్రియాశీలక రాజకీయాల నుంచి ఎప్పుడో తప్పుకున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సత్యనారాయణరావు వృద్ధాప్యంలో ఉన్నారని వ్యాఖ్యానించారు.

వృద్ధ్యాప్యంలో ఉండడం వల్ల కెసిఆర్ పాలనపై ఎం. సత్యనారాయణరావుకు అవగాహన లేదని అన్నారు. ఈ వయస్సులో ఎమ్మెస్సార్‌కు నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
కెసిఆర్ పాలన బాగుందని ఎమ్మెస్సార్ మెచ్చుకోవడమే కాకుండా ప్రతిపక్షాలు విమర్శలు చేయాలి కాబట్టి కాంగ్రెసు కూడా కెసిఆర్ పాలనపై విమర్శలు చేస్తోందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications