బతుకమ్మ పూల వ్యర్థాలతో బయో కంపోస్ట్.. వరంగల్ జీడబ్ల్యూఎంసీ సూపర్ ప్లాన్!

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజుల పాటు రంగురంగుల పూలతో మహిళలు చేసుకునే పూల జాతర బతుకమ్మ. కానీ పండుగ ముగిసాక ఆ టన్నుల కొద్దీ పూల వ్యర్థాలు అలా నిరుపయోగంగా మారిపోతాయి. కానీ వరంగల్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ వ్యర్థాలను సంపదగా మారుస్తూ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోంది.

వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీస్ పరిధిలో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న మహిళలు బతుకమ్మలను పేర్చటానికి ఉపయోగించిన పూలను వృధాగా పోనివ్వకుండా సంపదగా మార్చే పనిలో ఉంది. తాజాగా బతుకమ్మ పండుగకు గ్రేటర్ వరంగల్ పరిధిలో బంతి, చామంతి, గునుగు, తంగేడు, సీతజడ, గుమ్మడి, గులాబీ వంటి పూలు సుమారు 60 టన్నుల మేర వినియోగించినట్లు అధికారులు గుర్తించారు.

GWMC Bathukamma waste bio compost Warangal Turns Bathukamma Waste into Bio-Compost GWMC plan

ఎనిమిది రోజుల పాటు మైదానాల్లో ఆడి పడేసిన పువ్వులు, సద్దుల బతుకమ్మ నాడు చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసిన పూలను శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు సేకరించారు. ఇప్పటివరకు దాదాపు 40 టన్నుల పూల వ్యర్థాలను ఒడ్డుకు చేర్చి ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలించారు. ఆలయాలు, పూల మార్కెట్ల నుంచి వచ్చే వ్యర్థాలను కూడా వీటికి జత చేస్తున్నారు.సేకరించిన పూల వ్యర్థాలను నగరంలోని ఆరు ప్రత్యేక కేంద్రాల్లో ప్రాసెస్ చేస్తున్నారు.

మొదట పూలలో కలిసిపోయిన ప్లాస్టిక్ కవర్లు, దారాలు, రిబ్బన్లు, ఇతర వ్యర్థాలను వేరు చేస్తారు. ఆ తర్వాత శుద్ధి చేసిన పూలను గుంతలు, తొట్టెల్లో నింపి శాస్త్రీయ పద్ధతిలో బయో కంపోస్ట్‌గా మారుస్తారు. నిర్దిష్ట గడువులో సేంద్రియ పోషకాలు సమృద్ధిగా ఉండే పచ్చి ఎరువు సిద్ధమవుతుంది.ఈ బయో కంపోస్ట్‌ను గ్రేటర్ వరంగల్ పరిధిలోని అర్బన్ ప్లాంటేషన్, పార్కులు, డివైడర్లపై ఉన్న మొక్కలకు ఎరువుగా వాడుతున్నారు.

రసాయన రహిత సాగు వైపు మొగ్గు చూపే రైతులకు, నగర పౌరులకు నామమాత్రపు ధరకే లేదా ఉచితంగా సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భూమి నుంచి ఎదిగిన మొక్కలకు పూచిన పువ్వులను మళ్లీ భూమాతకు బలాన్నిచ్చే సేంద్రియ ఎరువుగా మార్చడం పట్ల ప్రజలు, పర్యావరణవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.పండుగల సమయంలో పూల వ్యర్థాలు పర్యావరణానికి భారం కాకుండా సద్వినియోగం చేసుకోవడం మంచి పద్ధతి అని పర్యావరణవేత్తలు చెప్తున్నారు.

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు పండుగ లాంటి వార్త!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు పండుగ లాంటి వార్త!

హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ కూడా బతుకమ్మ పూల వ్యర్థాలను కంపోస్ట్‌గా మార్చే కార్యక్రమం చేపట్టింది. వ్యర్థాల నిర్వహణలో వరంగల్ మున్సిపల్ యంత్రాంగం చూపిన చొరవ ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. సంప్రదాయాలను కాపాడుతూనే పర్యావరణాన్ని రక్షించే ఇలాంటి చర్యలు మరింత పెరగాలి. బతుకమ్మ పూలు కేవలం పూజలకే కాకుండా భూమికి బలం ఇచ్చే ఎరువుగా మారడం నిజంగా హర్షించదగిన విషయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+