బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు: రేపు విడుదల, బీజేపీ శ్రేణుల సంబరాలు
హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాల కేసులో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు బెయిల్ మంజూరైంది. గురువారం దాదాపు 8 గంటలపాటటు వాదలను విన్న తర్వాత హనుమకొండ కోర్టు బండి సంజయ్(bandi sanjay)కు రాత్రి పది గంటల సమయంలో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. డిఫెన్స్ వాదనలకు కోర్టు ఏకీభవించింది.

రూ. 20వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన హనుమకొండ కోర్టు(hanumakonda court). మరోవైపు పోలీస్ కస్టడీ పిటిషన్‌ను సోమవారానికి వాయిదా వేసింది. బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు కావడంతో ఆయన కరీంనగర్ జైలు నుంచి శుక్రవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయం బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందించనున్నారు.
అంతకుముందు బండి సంజయ్ బెయిల్‌పై తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. బెయిల్ ఇవ్వాలని బండి తరపు లాయర్లు గట్టిగా వాదిస్తుంటే.. విచారణ కొనసాగుతుంది బెయిల్ ఇవ్వొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాదించారు. బెయిల్ ఇవ్వకపోయినా.. బెయిల్ పిటీషన్ డిస్మిస్ చేయాలనే వాదన వినిపించారు సంజయ్ తరపు లాయర్లు.
ఏ ఆదేశాలు ఇచ్చినా.. ఈరోజే ఇవ్వాలని.. వరసగా మూడు రోజులు కోర్టుకు సెలవులు ఉన్నాయని.. బెయిల్ పిటీషన్ వాయిదా మాత్రం వేయొద్దని కోర్టుకు విన్నవించారు బండి సంజయ్ తరపు న్యాయవాదులు. బెయిల్ పిటీషన్ ఇవాళ నిర్ణయం తీసుకోకపోతే.. హైకోర్టుకు వెళ్లే అవకాశం కోల్పోతామని బండి సంజయ్ తరపు లాయర్లు వాదనలు వినిపించారు.
మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూషన్ మాత్రం.. పోలీస్ కస్టడీ ఇవ్వాలని కోరింది. విచారణ చేయాల్సింది ఇంకా ఉందని.. ఏ1గా ఉన్న వ్యక్తికి బెయిల్ మంజూరు చేయొద్దని వాదించారు. రెండు వర్గాల తరపున వాదనలు విన్న జిల్లా కోర్టు.. దాదాపు 8 గంటల తర్వాత బండి సంజయ్‌కు బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. విచారణకు సహకరించాలని బండి సంజయ్‌కు కోర్టు షరతు విధించింది.
బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. హైదరాబాద్, హనుమకొండ, కరీంనగర్, తదితర నగరాల్లో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. స్వీట్స్ పంచుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బెయిల్ మంజూరు కావడంతో శుక్రవారం కరీంనగర్ జైలు నుంచి ఆయన విడుదల కానున్నారు.












Click it and Unblock the Notifications