ప్రియురాలి తండ్రి ఆదేశం.. ఆమెను చంపి.. ఆపై.. ప్రియుడి నిర్వాకం!
ఉదయం లేచింది మొదలు ఎక్కడో ఒక చోట ఏదో ఒక హత్య జరిగిందన్న వార్తలు వింటూనే ఉన్నాం. మానవ సంబంధాలకు, అనుబంధాలకు ఏ మాత్రం విలువ లేకుండా అమానవీయంగా జరుగుతున్న అనేక దారుణ ఘటనలు మనల్ని ఆలోచించేలా చేస్తున్నాయి. తాజాగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారు డిక్కీలో మహిళ మృతదేహం లభించిన కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలిని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మానసగా గుర్తించారు.
పరువు కోసం ప్రియుడితో కూతుర్ని కాటికి పంపిన తండ్రి
ఈ కేసులో ఎల్కతుర్తికి చెందిన వినోద్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కుటుంబ పరువు పోతుందనే కారణంతో కన్న తండ్రి రాజేశం తన కుమార్తెను హత్య చేయాలని ప్రియుడిని ఆదేశించినట్లు దర్యాప్తులో తేలింది. మానసకు గతంలో రెండు వివాహాలు జరిగి, ఇద్దరు భర్తలతోనూ విడాకులు అయ్యాయి. అనంతరం ఆమె పుట్టింట్లో ఉంటూ కరీంనగర్‌కు చెందిన వినోద్‌కుమార్‌తో పరిచయం ఏర్పడి సన్నిహితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రియుడిని పెళ్ళికి ఒత్తిడి చేసిన యువతి
ఇటీవల మానస అరుణాచలం వెళ్తున్నానని చెప్పి వినోద్ వద్దకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ విషయాన్ని వినోద్ మానస తండ్రికి ఫోన్‌లో చెప్పాడు.
దీంతో కుమార్తె తమ మాట వినకుండా వ్యవహరిస్తోందని, కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేస్తోందని రాజేశం ఆగ్రహం వ్యక్తం చేశాడు. కుటుంబ పరువు పోతోందని భావించి ఆమెను హత్య చేయాలని వినోద్‌ను కోరినట్లు పోలీసులు వెల్లడించారు.
తండ్రి ఆదేశాలతో ప్రియురాలి హత్య .. పాతిపెట్టే యత్నం
తండ్రి ఆదేశాల మేరకు వినోద్ హత్యకు పాల్పడినట్లు విచారణలో అంగీకరించాడు. అనంతరం మృతదేహాన్ని కారులో తరలించి ఎల్కతుర్తి పరిసరాల్లో పాతిపెట్టేందుకు ప్రయత్నించాడు.
అయితే పరిసరాల్లో దుర్వాసన రావడంతో స్థానికులు అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టి మృతదేహాన్ని గుర్తించారు.
తండ్రి పాత్రపై పోలీసుల విచారణ
అనుమానితుల కదలికలపై ఆరా తీసి ఎల్కతుర్తి శివారులో వినోద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా వివరాలు వెల్లడయ్యాయి. ఈ కేసులో తండ్రి రాజేశం పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ పరువు పేరుతో తండ్రే కుమార్తెను హత్య చేయించిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు మరిన్ని వివరాల కోసం విచారణను కొనసాగిస్తున్నారు.













Click it and Unblock the Notifications