వేధింపుల వాట్సప్ చాట్ : మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో కీలకవిషయాలు వెల్లడించిన సీపీ రంగనాథ్

వేధింపుల వాట్సప్ చాట్ సైఫ్ ఫోన్లో ఉందని, మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో సీపీ రంగనాథ్ కీలకవిషయాలు వెల్లడించారు.

వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో నిందితుడు మెడికో సైఫ్ ను అరెస్ట్ చేసిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు నేడు సైఫ్ ను కోర్టు ముందు హాజరు పరచనున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ ఈ కేసులో కీలక విషయాలను వెల్లడించారు.

సైఫ్ కావాలనే ప్రీతిని వేధించినట్లు వాట్సప్ చాట్స్ ఉన్నాయి: సీపీ రంగనాథ్

సైఫ్ కావాలనే ప్రీతిని వేధించినట్లు వాట్సప్ చాట్స్ ఉన్నాయి: సీపీ రంగనాథ్

పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పిన ఆయన సైఫ్ కావాలనే ప్రీతిని వేధించినట్లు వాట్సప్ చాట్స్ ద్వారా తెలిసిందన్నారు. సైఫ్ మొబైల్ లో అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. తన ఫ్రెండ్స్ తో కూడా ప్రీతి ఎక్కువ చేస్తున్నట్లు చెప్పాడని, సైఫ్ కి ప్రీతి తనని ఎందుకు వేధిస్తున్నావ్ అంటూ మెసేజ్ కూడా చేసిందని సిపి రంగనాథ్ పేర్కొన్నారు. సైఫ్ వేధింపులే ప్రీతి తీవ్ర నిర్ణయానికి కారణం అన్నారు.

గూగుల్ లో ఆత్మహత్య చేసుకునేందుకు ఇంజక్షన్ కోసం వెతికిన ప్రీతి

గూగుల్ లో ఆత్మహత్య చేసుకునేందుకు ఇంజక్షన్ కోసం వెతికిన ప్రీతి

ప్రీతి మానసికంగా ఇబ్బంది పడినందువల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని వెల్లడించారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కోసం గూగుల్లో ఇంజక్షన్ కోసం వెతికిందని, సక్సీ నైల్ కోలిన్ అనే ఇంజక్షన్ తో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందని సిపి రంగనాథ్ పేర్కొన్నారు. ప్రీతి ఆత్మహత్యయత్నానికి సైఫ్ వేధింపులే కారణం అని ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. బ్లడ్ శాంపిల్స్ తీశామని, టాక్సీకాలజీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ఈ ఘటనకు రాజకీయరంగు పులమొద్దన్నారు.

పోలీసులు స్పందించలేదు అన్నది అవాస్తవం

సైఫ్ కు ఎటువంటి పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేదని, పోలీస్ రియాక్ట్ కాలేదన్నది అవాస్తవమని సిపి వెల్లడించారు. పోలీసులను హెల్ప్ కావాలని తనకున్న సంబంధాలతో ప్రీతి తండ్రి ఓరల్ గా అడిగారని, ప్రీతి తండ్రి అడిగిన తర్వాత పోలీసులు రియాక్ట్ అయ్యారని చెప్పారు. ర్యాగింగ్ అనేది ఎక్కడ ఉండకూడదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఇంకా ఎంక్వయిరీ చేస్తున్నామని, ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులతో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసుల పరంగా ఎటువంటి నిర్లక్ష్యం వహించలేదని పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. కళాశాలల్లో ర్యాగింగ్ లను ఉపేక్షించేది లేదన్నారు వరంగల్ పోలీస్ బాస్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+