మేడిగడ్డపై అనవసరపు రాద్దాంతం: నేటి కాళేశ్వరం పర్యటన అందుకే: హరీష్ రావు అసహనం!!
మేడిగడ్డ బ్యారేజీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుధ్హంగా ఉండని BRS సీనియర్ నాయకుడు Harish rao ఆరోపించారు. గత ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడం చిన్న విషయమని దాన్ని భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదని చెప్పిన ఆయన, మిగతా బ్యారేజీ లను కూడా చూడాలని, కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు జరిగిన మేలును కూడా ప్రజలకు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అధికార పక్షం మాట్లాడినా తర్వాత తమకు మాట్లాడే అవకాశం ఇవ్వక పోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని అన్నారు.

శాసనసభ మీడియా పాయింటు వద్ద మాజీ మంత్రి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదనీ చెబుతూ, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 141 TMC ల నీటి నిల్వ సామర్ధ్యం, 530 మీటర్ల ఎత్తిపోతలు, 240 TMC ల నీటి వినియోగం వీటన్నిటి సమాహారం కాళేశ్వరం ప్రాజెక్టు అని వివరించారు.
ఒక్క ఆనకట్ట వద్ద ఒకటి రెండు కుంగిపోతే మొత్తం ప్రాజెక్టు ను నిందించటం సరికాదన్నారు. మేడిగడ్డకు వెళ్ళే దారిలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కుడెల్లి వాగు ఉన్నాయనీ, కాళేశ్వరం ఫలితాలు రైతులను అడగాలనీ కోరారు. తమ ప్రభుత్వం నీళ్ళు లేని చోట కాకుండా, నీళ్ళున్న చోట కూడా ప్రాజెక్టులు కట్టి నీళ్ళు అందించామన్నారు.
మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండింది అంటే ప్రాజెక్టుల జలాల వల్లే అన్నారు. ప్రాజెక్టులో తప్పు జరిగితే చర్య తీసుకోవాలనీ, పునరుద్దరణ పనులు చేపట్టాలనీ ప్రభుత్వాన్ని కోరారు. BRS సభ నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకే ప్రభుత్వం మేడిగడ్డ కార్యక్రమం తలపెట్టిందని హరీష్ రావు ఆరోపించారు. కావాలని చిన్న విషయాన్ని రాద్దాంతం చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications