కేసీఆర్ చేతిలోనే తెలంగాణ సేఫ్: అబద్ధాల కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్ల గల్లంతంటూ హరీశ్
సిద్దిపేట: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేతిలో తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉందన్నారు మంత్రి హరీశ్ రావు (Harish Rao). అబద్ధాలతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. శుక్రవారం కాంగ్రెస్ బ్లాక్ ప్రెసిడెంట్ ముశినం శ్రీనివాస్ (మాంగోలు), కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, ఎన్‌ఎస్‌యూఐ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు శ్రావణ్ తదితరులు మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు హరీశ్ రావు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. చంటి పిల్ల కన్న తల్లి చేతుల్లో ఎంత క్షేమంగా ఉంటుందో కేసీఆర్(KCR) చేతుల్లో తెలంగాణ అంత సురక్షితంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజల మీద ప్రేమ తక్కువ..అధికారం మీద యావ ఎక్కువ అని విమర్శించారు. అబద్ధాలతో అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్‌తో జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో పదికి పది మనమే గెలవ బోతున్నామని స్పష్టం చేశారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలంగాణకు వచ్చి మేము ఐదు గంటలు కరెంట్ ఇస్తున్నామని అన్నాడని ఎద్దేవా చేశారు. మన రాష్ట్రంలో గత 8 ఏళ్లుగా వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా కరెంట్ ఇస్తున్నామని చెప్పారు.
రైతుబంధు సృష్టి కర్త మన కేసీఆర్ నేడు తెలంగాలో బంగారంల రెండు పంటలు పక్కాగ పండుతున్నామయంటే అది కేసీఆర్ ఘనతే అన్నారు. ఒక నాడు కరువుతో ఉన్నాం. నేడు సస్యశ్యామలంగా మార్చుకున్నాం. మళ్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే 10ఏండ్లు వెనక్కి పోతామని హెచ్చరించారు. అందరం కలిసి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామని పిలుపునిచ్చారు.
నర్సాపూర్ అభ్యర్థి తరపున హరీశ్ రావు ప్రచారం : నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్(BRS) గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు మంత్రి హరీశ్ రావు. సునితామహేందర్‌రెడ్డి గెలిస్తే నర్సాపూర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని అన్నారు. నర్సాపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నామినేషన్ ర్యాలీలో మంత్రి హరీశ్ పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సంక్షేమ ఫలాలను అందరికి పంచేలా చూశారని హరీశ్ రావు తెలిపారు.
పదకొండు సార్లు కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే ఏమీ చేయలేదని విమర్శించారు. బీజేపీకి ఒకటే సీటు వచ్చిందని ఈసారి డిపాజిట్లు కూడా రావన్నారు హరీశ్. బీజేపీ డక్ అవుట్, కాంగ్రెస్ రన్ అవుట్ అయితే, కేసీఆర్ సెంచరీ కొడుతారన్నారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో 28 లక్షల మోటర్లు ఉన్న రైతులు కేసీఆర్‌ను కాదని ఇతర పార్టీలకు ఓటు వేయరన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఇప్పటి వరకు సర్పంచి కూడా కాలేదన్నారు. సునీతా రెడ్డిని ఎమ్మెల్యేను చేయండి.. మదన్ రెడ్డిని ఎంపీ చేసే బాధ్యత నాది అని హామీనిచ్చారు హరీశ్ రావు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications