మాట్లాడుకుందాం, రా!, లేకుంటే అంతే...: దేవినేని ఉమకు హరీశ్ ఫోన్
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్‌డిఎస్)పై చర్చలకు రావాలని ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేస్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు తెలంగాణ మంత్రి హరీష్‌రావు ఫోన్ చేశారు. ఆర్డీఎస్ పనులు నిలిపివేయాలని కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ కలెక్టర్‌కు కర్నూల్ కలెక్టర్ రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని హరీష్‌రావు కోరారు.
రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం రాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సహకారం ఇవ్వబోమని ఆయన మంగళవారం హెచ్చరించారు. ఏపీ వైఖరిపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆర్డీఎస్ వద్ద తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పనులను అడ్డుకోవాలంటూ కర్ణాటకలోని రాయచూరు కలెక్టర్‌కు ఉమ లేఖ రాయడాన్ని ఆయన తప్పు పట్టారు.
తాము ఎప్పుడూ చర్చలకు సిద్ధంగానే ఉన్నామని హరీశ్ రావు చెప్పారు. తాము చేపడుతున్నది కొత్త ప్రాజెక్టేమీ కాదని ఆయన చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు కాదని స్పష్టం చేశారు. 20 రోజులుగా అడుగుతున్నా చర్చలకు దేవినేని ఉమ ముందుకు రావడం లేదని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో అన్నారు.
రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్)ను అడ్డుకుంటున్నది ఎి చంద్రబాబే అని విమర్శించారు.ఆర్డీఎస్‌కు 15.9 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఆర్డీఎస్ పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
ఆర్డీఎస్ కింద 87,500 ఎకరాలు పారాల్సి ఉండగా, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల 20 వేల ఎకరాలకు కూడా నీరు పారలేదని తెలిపారు. ఆర్డీఎస్ పనుల కోసం గత ప్రభుత్వం కర్ణాటకలో రూ. 72 కోట్లు ఇచ్చింది, కానీ ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టు కాదని స్పష్టం చేశారు. పాలమూరు, డిండి పథకాలు గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ప్రకారమే నిర్మిస్తామని చెప్పారు.

ఇదిలావుంటే, తెలంగాణ మంత్రి హరీష్ రావుకు నోటి దురుసు ఎక్కువని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని అన్న విషయం గుర్తుంచుకోవాలని కేఈ సూచించారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్‌లను ఎలా అడ్డుకోవాలో తమ దగ్గర వ్యూహం ఉందని డిప్యూటీ సీఎం కేఈ వ్యాఖ్యానించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దీక్ష కేసీఆర్ ఇంటి వద్ద లేదా ఢిల్లీలో చేయాలని కేఈ సూచించారు. కర్నూలులో దీక్ష చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. జగన్ ఢిల్లీ పెద్దల వద్ద ఏనాడూ రాష్ట్ర సమస్యలపై మాట్లాడలేదని కేఈ విమర్శించారు.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications