నిరాడంబరత: ప్లేటు పట్టుకొని, క్యూలో నిలబడి, స్వయంగా వడ్డించుకున్న హరీష్

సోమవారం హరీష్ రావు తన నిరాడంబరతను మరోసారి చూపించారు. మీడియా ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేల సహాయకులతో కలిసి ఆయన భోజనం చేశారు.

హైదరాబాద్: అసెంబ్లీలో వాడీవేడి చర్చల అనంతరం, భోజన విరామ సమయంలో తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం నాడు నిరాడంబరతను చాటుకున్నారు. సిద్దిపేట ప్రజాప్రతినిధిగా ఉన్న ఆయన.. ఇంటింటికి తిరుగుతారని అంటారు.

అందుకే సిద్దిపేట ప్రజలు హరీష్ రావు అంటే అభిమానం చూపిస్తారు. భవంతి అయినా, గుడిసె అయినా ఆయన స్వయంగా వెళ్లి ప్రజలను కలుస్తారు. వారి సమస్యలను తెలుసుంటారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.

సోమవారం ఆయన తన నిరాడంబరతను మరోసారి చూపించారు. మీడియా ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేల సహాయకులతో కలిసి ఆయన భోజనం చేశారు. అందరూ ప్లేట్లు పట్టుకొని వరుసలో నిలబడి ఉన్నారు. హరీష్ రావు కూడా చేతిలో ప్లేటు పట్టుకొని క్యూలో నిలబడ్డారు.

ప్లేటు పట్టుకొని వరుసలో హరీష్

ప్లేటు పట్టుకొని వరుసలో హరీష్

సోమవారం గ్యాంగ్ స్టర్‌ నయీం కేసు పై చర్చ అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ లాబీల్లోని లాంజ్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో కలిసి భోజనం చేశారు. ప్లేటు పట్టుకొని, వరుసలో నిలబడి, అన్నం, కూరలను స్వయంగా వడ్డించుకున్నారు. ఆ తర్వాత మరో మంత్రి ఈటెల రాజేందర్‌, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, వేముల ప్రశాంత్ రెడ్డి, మనోహర్ రెడ్డిలు వచ్చారు.

చిన్న నోట్లపై హరీష్ రావు

చిన్న నోట్లపై హరీష్ రావు

ఇదిలా ఉండగా, రాష్ట్రానికి ఇంకా రూ.5 వేల కోట్ల నగదు రావాల్సి ఉందని, దీనిని పూర్తిగా చిన్న నోట్ల రూపంలో ఇవ్వాలని ఆర్బీఐని మంత్రి హరీశ్ రావు కోరారు. ఈ మేరకు ఆర్బీఐని కేంద్రం ఆదేశించాలని పేర్కొన్నారు.

ప్రాజెక్టులపై హరీష్ రావు

ప్రాజెక్టులపై హరీష్ రావు

అదిలాబాద్‌, మహారాష్ట్ర సరిహద్దులో పెన్‌గంగపై చేపట్టిన చనాకా కొరటా ప్రాజెక్టును ఆరునెలల్లో సిద్ధం చేయాలని అధికారులను హరీశ్‌ రావు ఆదేశించారు. ప్రభుత్వం చాలెంజ్‌గా తీసుకున్న ఈ ప్రాజెక్టు పనులను ఫాస్ట్‌ ట్రాక్ పద్ధతిన పూర్తి చేయాలన్నారు.

తెలంగాణ అసెంబ్లీ వాడిగా

తెలంగాణ అసెంబ్లీ వాడిగా

సోమవారం నాడు గ్యాంగ్ స్టర్ నయీం అంశం పైన తెలంగాణ అసెంబ్లీలో వాడిగా వేడిగా చర్చ జరిగింది. నయీం కేసును సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ససేమీరా అన్నారు.

అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం..

అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం..

సోమవారం నాడు గ్యాంగ్ స్టర్ నయీం అంశం పైన తెలంగాణ అసెంబ్లీలో వాడిగా వేడిగా చర్చ జరిగింది. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉత్తమ్, జానా రెడ్డి, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డిలు మీడియా పాయింటు వద్దకు వచ్చి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

జానా రెడ్డి ఆగ్రహం, హెచ్చరిక

జానా రెడ్డి ఆగ్రహం, హెచ్చరిక

శాసనసభలో సభాపతి మధుసూదనాచారి అప్రజాస్వామికంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. ఆయన పక్షపాత ధోరణి వీడకపోతే అవిశ్వాస తీర్మానం పెడతామని హెచ్చరించింది.

కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ నేతలు

శాసనసభ మంగళవారానికి వాయిదా పడిన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, జీవన్‌రెడ్డి, తదితరులు మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు.

వాయిదా వేస్తారా

వాయిదా వేస్తారా

నయీం కేసుపై సీఎం కేసీఆర్‌ మాట్లాడిన తర్వాత ప్రతిపక్షాల వివరణ తీసుకోకుండా స్పీకర్‌ సభను వాయిదావేశారని, దీనిపై సభాపతిని కలిసి సమాధానం కోరితే చెప్పలేదన్నారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అధికార పార్టీ అడుగడుగునా అడ్డుకుంటుందన్నారు.

రేవంత్ ఆగ్రహం

రేవంత్ ఆగ్రహం

నయీం కేసుపై సీఎం కేసీఆర్‌ మాట్లాడిన తర్వాత ప్రతిపక్షాల వివరణ తీసుకోకుండా స్పీకర్‌ సభను వాయిదా వేశారని, ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అధికార పార్టీ అడుగడుగునా అడ్డుకుంటోందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+