దేశంలో తెలంగాణ 3వ స్థానం: వైద్యారోగ్య మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న హరీశ్ రావు

వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి నివేదికను హరీశ్ రావు విడుదల చేశారు.

హైదరాబాద్: వైద్య రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి నివేదికను హరీశ్ రావు విడుదల చేశారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేలా 2022లో అనేక మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు.

దేశంలో ఉత్తమ వైద్యసేవలందిస్తున్న మూడో రాష్ట్రంగా తెలంగాణ

దేశంలో ఉత్తమ వైద్యసేవలందిస్తున్న మూడో రాష్ట్రంగా తెలంగాణ

2022లో దేశంలోనే ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న మూడో రాష్ట్రంగా తెలంగాణను నీతిఆయోగ్‌ గుర్తింపు పొందిందని హరీశ్‌ రావు తెలిపారు. మాతా, శిశు మరణాల రేటు అతి తక్కువగా ఉన్న మూడో రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. 2014 నాటికి రాష్ట్రంలో శిశు మరణాల రేటు 39 కాగా.. ప్రస్తుతానికి 21కి తగ్గిందని వెల్లడించారు. గత ఏడాది రాష్ట్రంలో 8 మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఈ ఏడాది మరో 9 కొత్త మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్‌, 7 పోస్టు గ్రాడ్యుయేట్‌ సీట్లు ఉన్నాయని చెప్పారు. మెడికల్‌ కాలేజీల ఏర్పాటుతో పేదలకు విద్యతో పాటు వైద్యం కూడా అందుబాటులోకి వస్తుందని హరీశ్‌ రావు తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారీగా పెరిగిన ఓపీ సేవలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారీగా పెరిగిన ఓపీ సేవలు

వరంగల్‌లో రూ.1100 కోట్లతో 2వేల పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నామని చెప్పారు మంత్రి హరీశ్ రావు. ఆస్పత్రి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు ఉచితంగా డయాలసిస్‌ సేవలు అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. పేద మహిళలకు న్యూట్రీషన్‌ కిట్స్‌ కూడా అందజేస్తున్నామని తెలిపారు. వసతులు పెంచడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరిగిందని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. 2021లో 4 కోట్ల 21 లక్షల మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు పొందారని మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. 2022లో 4 కోట్ల 60 లక్షల మందికిపైగా ఓపీ సేవలు వినియోగించుకున్నారని తెలిపారు. ఇన్‌పేషెంట్ల సంఖ్య కూడా 30 లక్షలకు పైగా పెరిగిందని అన్నారు. 2022లో బస్తీ దవాఖానాల్లో 47 లక్షల మంది ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారని మంత్రి వివరించారు. ఎన్‌సీడీసీ స్క్రీనింగ్‌ ద్వారా ఇంటి వద్దకు వెళ్లి పరీక్షలు చేస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రులో 99.9 డెలివరీలు పెంచామన్న హరీశ్ రావు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య 61 శాతం పెరిగిందని హరీశ్‌ రావు తెలిపారు. నార్మల్‌ డెలివరీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. నార్మల్‌ డెలివరీకి ఇన్సెంటివ్స్‌ కూడా ఇచ్చామని మంత్రి చెప్పారు. ఈ విషయంలో కేంద్రం కూడా అభినందించిందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2021లో 2.57 లక్షలు, 2022లో 3.04 లక్షల సర్జరీలు చేశామని తెలిపారు. 2022లో 5.40 లక్షల డెలివరీలు జరిగితే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 3.27 లక్షల డెలివరీలు జరిగాయని చెప్పారు. అంటే దాదాపు 62 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని
మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలను 99.9 శాతానికి పెంచామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టిఫా స్కానింగ్‌ యాత్రాలు ఏర్పాటు చేశామని చెపారు. ప్రతి ఆస్పత్రిలో ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ టీమ్‌ ఏర్పాటుచేశామన్నారు. తెలంగాణలో బాలింత మరణాల రేటును 43 శాతానికి తగ్గించి ఈ విషయంలో కూడా దేశంలో మూడో స్థానంలో ఉన్నట్లు మంత్రి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+