Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మానుకోట దాడి రిపీట్ అవుద్ది : జగన్ కు హరీశ్ వార్నింగ్

పాలమూరు ఎత్తిపోతల పథకం.. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ల మధ్య వివాదంగా మారుతోంది. నిబంధనలకు లోబడే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంటే, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మాత్రం అక్రమమంటూ జలదీక్షకు దిగిన విషయం తెలిసిందే. కాగా.. జలదీక్ష సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకపడ్డ జగన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు.

తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు తగలాలని చూస్తే.. మానుకోట చరిత్ర పునరావృతం అవుతుందని జగన్ ని హెచ్చరించారు. జలదీక్షతో తెలంగాణ ప్రాజెక్టులకు వచ్చే నష్టమేమి లేదని, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణపై ఏపీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఏమాత్రం సహించేది లేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జగన్ పై వరంగల్ జిల్లా మహబూబాద్ లో రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే.

పెన్ గంగా ప్రాజెక్టు పనుల పరిశీలన నిమిత్తం మహారాష్ట-తెలంగాణ సరిహద్దులో పర్యటిస్తున్న మంత్రి హరీశ్ రావు, జగన్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు లోబడే తాము ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని ప్రకటించిన ఆయన, గోదావరి, కృష్ణా నదుల నుంచి ఒక్క చుక్క నీటిని కూడా ఎక్కువగా వాడుకోబోమని తేల్చి చెప్పారు. అలాగే ప్రాణహిత-చేవెళ్ళ విషయంలోను కాంగ్రెస్ అనవసర రాద్దాంతమన్నారు.

ఏపీలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రాజెక్టులను టార్గెట్ చేయడం సబబు కాదని, రెండు పార్టీలు ఎందుకంతగా ఎగిరెగిరి పడుతున్నాయని ఎద్దేవా చేశారు. కోర్టుల చుట్టూ తిరిగి ప్రాజెక్టులను ఆపాలనే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారని, జలదీక్షల పేరిట జగన్ తెలంగాణకు అడ్డుపుల్లలు వేస్తున్నారని విమర్శించారు.

రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి విషయాలేవైనా.. సంప్రదింపులతోనే సమన్వయమవుతాయన్నారు. ప్రాజెక్టులపై అన్ని విషయాలు క్షుణ్ణంగా మాట్లాడేందుకు ఏపీ మంత్రి దేవినేనిని ఎన్నిసార్లు ఫోన్ లో సంప్రందించినా స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

 harish rao strong warning to jagan
హైదరాబాద్ : మరో తెలంగాణ నేత నాగం జనార్దన్ రెడ్డి కూడా జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టుల‌ విషయంలో ఏపీకి అన్యాయం జ‌రుగుతోందంటూ తెలంగాణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్ దీక్ష‌ చేపట్టడంపై మండిపడ్డారు. అలాగే దీనిపై కోర్టులకు వెళ్తామని ఏపీ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలను తిప్పి కొట్టారు.

సోమవారం హైద‌రాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన నాగం జనార్ధన్ రెడ్డి.. తెలంగాణ ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీర్చడం కోసం నిర్మిస్తోన్న ప్రాజెక్టులకు అడ్డు తగలడం సరికాదన్నారు. జలదీక్షలో జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ తెలంగాణ ప్రజలను రెచ్చ‌గొట్టే విధంగా మాట్లాడవద్దని సూచించారు.

కృష్ణా జలాల ద్వారా ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల రైతుల క‌ష్టాల‌ు గట్టెక్కుతాయని, కృష్ణా జలాల వినియోగం అక్కడి ప్ర‌జ‌ల‌ హ‌క్క‌ు అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. తెలంగాణ ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను హ‌రించ‌వ‌ద్ద‌ని హితవు పలికిన ఆయన, ప్రాజెక్టుల‌ను అడ్డుకోవాల‌ని చూస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. తెలంగాణ ప్రాజెక్టుల‌ను ఆపే శక్తి ఎవరికీ లేదని, డిండి ఎత్తిపోతల పథకానికి దివంగ‌త మాజీ సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హయాంలోనే జీవో ఇచ్చారన్న విషయాన్ని ఏపీ నేతలు గుర్తుంచుకోవాలని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+