మోడీ దగ్గరగా ఉన్నామన్న మంత్రులెక్కడ: చాకిరేవు పెట్టిన హరీష్ రావు!!

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణ కేటాయింపులపై, తెలంగాణా బడ్జెట్ సమావేశాలపైన మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ పేరే లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీకి దగ్గరగా ఉన్నాం,రోజు మంత్రులం కలుస్తున్నామన్నారు.. ఏమైంది మీ కలయిక అంటూ తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

ఏపీలో పోలవరం జాతీయ హోదా.. తెలంగాణా మాటేంటి
కేంద్రంలో బీజేపీ, తెలంగాణ లో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. ఏపీలో పోలవరానికి జాతీయ హోదా కల్పించినప్పుడు తెలంగాణ ప్రాజెక్టు కు ఇవ్వాలి కదా అంటూ నిలదీశారు. తెలంగాణాకు బడ్జెట్ లో అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుందని అసహనం వ్యక్తం చేశారు.

Harish Rao targets uinon budget 2024 and telangana assembly budget session

బిఏసీలో బీఆర్ఎస్ డిమాండ్లు
నేడు తెలంగాణా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన హరీష్ రావు బిఏసీలో తొమ్మిది అంశాలను పొందు పర్చామని, నిరుద్యోగ సమస్యలు,జాబ్ క్యాలెండర్ పై చర్చ పెట్టాలని చెప్పామన్నారు. అంతేకాదు నిరుద్యోగుల మీద అక్రమ కేసులపై చర్చ పెట్టాలని కోరామన్నారు. శాంతి భద్రతలపైన చర్చ జరగాలని కోరినట్టు చెప్పారు.

తెలంగాణా బడ్జెట్ సమావేశాలపై హరీష్ రావు అసహనం
బడ్జెట్ చర్చను నాలుగు రోజులకు కుదించారని, కనీసం 15 రోజులు బడ్జెట్ సమావేశాలు జరపాలని బిఎసిలో డిమాండ్ చేశామన్నారు. ఆరు గ్యారెంటీలకు చట్ట బద్దత కల్పిస్తామని నాడు చెప్పారని, కానీ ఇప్పటికీ చెయ్యలేదని అన్నారు హరీష్ రావు. గతంలో పద్దులమీద ఎనిమిది రోజులు చర్చ జరిపామని, కానీ ఇప్పడు రెండు రోజుల్లో డిమాండ్ల మీద చర్చ జరపాలని చూస్తూన్నారని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. నాలుగు రోజులకు బడ్జెట్ కుదించాలని చూస్తున్నారన్నారు.

ఈ అంశాలపై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్
రుణ మాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని, చర్చ జరగాలని చెప్పామని, రైతు భారోసాపైన, కాంగ్రెస్ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతున్న అంశాలపైన చర్చ జరగాలన్నామని చెప్పారు. తెలంగాణా బడ్జెట్ సమావేశాల పైన మాత్రమే కాదు కేంద్ర బడ్జెట్ పైనా తనదైన శైలిలో హరీష్ రావు టార్గెట్ చేశారు. కేంద్రాన్ని, తెలంగాణా ప్రభుత్వాన్ని చాకిరేవు పెట్టి ఉతికి ఆరేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+