HBD CM KCR: పోటాపోటీగా కేసీఆర్ జన్మదిన వేడుకలు; గులాబీ నేతల్లో పెల్లుబికిన అభిమానం!!

నేడు కేసీఆర్ జన్మదినం సందర్భంగా పోటాపోటీగా కేసీఆర్ జన్మదిన వేడుకలు చేస్తున్న గులాబీ నేతలు వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు ఈరోజు. ఈసారి కనివిని ఎరుగని రీతిలో కేసీఆర్ జన్మదిన వేడుకలను గులాబీ దండు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా కేసీఆర్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజుకు ఒకరోజు ముందు నుండే హంగామా మొదలైంది.

కెసీఆర్ పుట్టినరోజు.. క్రికెట్ టోర్నమెంట్ లు, సంబరాలు


సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం సిద్ధిపేట లోని జయశంకర్ స్టేడియంలో సీఎం కేసీఆర్ కప్ సీజన్ 3 టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభించారు. మంత్రి హరీష్ రావు, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, సినీనటుడు నానితో కలిసి టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా పివి మార్గంలోని సంజీవయ్య పార్క్ పక్కన ఉన్న థ్రిల్ సిటీలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, సంబరాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు

ఇక వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నూతన సచివాలయ మోడల్ నమూనాతో ఆజం జాహి మిల్క్ గ్రౌండ్స్ లో మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. కెసిఆర్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి సాధించిన విజయాలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శించడంతోపాటు, సాంస్కృతిక కార్యక్రమాలు, బాణాసంచా కాల్చడం వంటి కార్యక్రమాలతో కెసిఆర్ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారు. అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం లో అరికెపూడి గాంధీ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు.

పప్పు ధాన్యాలతో కేసీఆర్ నిలువెత్తు చిత్రం

సీఎం కేసీఆర్ పై తమ అభిమానాన్ని చాటుకునేలా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పల్లీలు ఉలవలు, ఉప్పు, రంగులతో 25 అడుగుల పొడవు అడుగుల వెడల్పు సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని రూపొందింపజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సీఎం కేసీఆర్ పట్ల తమ విధేయతను ప్రదర్శించారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కెసిఆర్ క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రారంభించారు. కేక్ కట్ చేసే సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

పేద జంటలకు పెళ్ళిళ్ళు ... ఆలయాల్లో శ్రీనివాస కళ్యాణాలు

ఇక కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోదావరిఖని శ్రీ కోదండ రామాలయంలో ఆరుగురు నిరుపేద జంటలకు పెళ్లిళ్లు చేశారు. అంతకుముందు సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీనివాస కళ్యాణం జరిపించారు. బి ఆర్ ఎస్ వి ఓయు ప్రధాన కార్యదర్శి మిథున్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా 12,625 ఆలయాలలో నేడు ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు.

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కేసీఆర్ ప్రసన్నం కోసమేనా?

రక్తదానాలు, వైద్య శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలతో కెసిఆర్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈసారి ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రెట్టించిన ఉత్సాహంతో కెసిఆర్ జన్మదిన వేడుకలను జరుపుతున్న తీరు అందరిలో ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజంగా కేసీఆర్ పై వీరందరికీ ఉంది అభిమానమా లేక ఎన్నికల సంవత్సరం కావడంతో కెసిఆర్ ను ప్రసన్నం చేసుకోవడానికి పుట్టినరోజును వాడుకుంటున్నారా అని ఆలోచిస్తున్న వారు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా ఈసారి సీఎం కేసీఆర్ జన్మదినం చాలా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో కెసిఆర్ ని ప్రసన్నం చేసుకోవడానికి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం కూడా ఒక అవకాశం గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+