హెచ్‌సియులో మరో దారుణం: ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రవీణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో అతను ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. హెచ్‌సియులో అతను ఫైన్ ఆర్ట్స్ కోర్సు చేస్తున్నాడు.
ప్రవీణ్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. అతని మరణానికి కారణాలు తెలియడం లేదు. ప్రవీణ్ మహబూబ్‌నగర్ జిల్లా షాబాద్ మండలానికి చెందినవాడు. వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన మరుపునకు రాక ముందే హెచ్‌సియులో ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రవీణ్ ఎంఎఫ్ఎ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. విశ్వవిద్యాలయంలోని ఎల్ బ్లాక్‌లో గల తన గదిలో అతను శనివారం తెల్లవారు జామున ఉరేసుకున్నాడు. నెల రోజుల క్రితమే ప్రవీణ్ విశ్వవిద్యాలయంలో చేరాడు.












Click it and Unblock the Notifications