మురికి కాల్వలోని చెత్తను చేతితో ఏరివేసిన మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట: వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణాన్ని సాధించవచ్చంటూ మరో సంస్కరణకు శ్రీకారం చుట్టారు. నడకతో ఆరోగ్యం, చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణం కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఇందులో భాగంగా సిద్దిపేట(Siddipet)లో మన చెత్త-మన బాధ్యత అంటూ ప్రచారం నిర్వహించారు.

చెత్తవల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వీధుల్లో నడుస్తూ చెత్త ఏరారు. సిద్దిపేట పట్టణంలోని 18వ వార్డులో నడుస్తూ మురికి కాలువలో పేరుకుపోయిన పేపర్లు, కవర్ల లాంటి చెత్తను స్వయంగా తొలగించారు మంత్రి హరీశ్ రావు(Harish Rao). చెత్త పేరుకుపోవడంతో అపరిశుభ్రమైన వాతావరణం ఉంటుందని చెప్పారు. ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

harishraoinmanachettamanabadhyathaprogram

ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన కుటుంబం, సమాజం సాధ్యమవుతుందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. వర్షాకాలంలో అంటు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకున్నా, నీటి నిల్వ ఉండటంతో దోమలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుందన్నారు. వాటి ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే దోమల నివారణకు అందరూ కృషి చేయాలని మంత్రి సూచించారు.

పూల కుండీలు, కొబ్బరి చిప్పల్లో నిల్వఉండే నీళ్లలో దోమల లార్వా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటే ప్రతీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆరోగ్యం విషయంలో నివారణ కంటే జాగ్రత్త ఉత్తమం అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. వ్యాధులు రాకుండా ముందుగా జాగ్రత్త పాటించడం వల్లనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని చెప్పారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

యోగా చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటామని, క్రమపద్ధతిలో చేస్తే జీవితకాలం పెరుగుతుందని హరీశ్ రావు అన్నారు. జిల్లాలోని ఓ పాఠశాలలో నిర్వహించిన ఆనంద యోగా క్యాంప్ కార్యక్రమానికి హాజరై 100 మంది అభ్యాసకులకు మ్యాట్లు పంపిణీ చేశారు. పట్టణంలోని వార్డుల వారీగా 10 రోజులు ఉచిత యోగా శిబిరం నిర్వహిస్తున్నామని హరీశ్ రావు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+