మరికాసేపట్లో హైదరాబాద్ లో దంచికొట్టనున్న భారీవర్షం.. బయటకు రాకండి!

హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షం మొదలైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, ఐకియా సెంటర్, పంజాగుట్ట, కూకట్పల్లి, అమీర్పేట సహా అనేక ప్రాంతాలలో వర్షం కురుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో భారీ వర్షాల నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఇటు హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

రెండుగంటల్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం
ఐటి ఉద్యోగులను వర్క్ ఫ్రం చేసుకోవాల్సిందిగా, రోడ్లపైకి వచ్చి ఇబ్బంది పడకుండా ఉండవలసిందిగా కోరుతున్నారు. ఇదిలా ఉంటే రానున్న 1-2 గంటలలో ఖైరతాబాద్, బేగంపేట్, కొండాపూర్, జూబ్లీహిల్స్, షేక్‌పేట్, అత్తాపూర్, అల్వాల్, మల్కాజిగిరి, ముషీరాబాద్, అబిడ్స్, చార్మినార్, రాజేంద్రనగర్, ఉప్పల్, ఎల్‌బీ నగర్ (సమీప ప్రాంతాలు) - నగరంలో చాలా ప్రాంతాలకు వర్షాలు విస్తరించాయని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.

heavy rainfall in Hyderabad in two hours don t come outside Key alert

భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలివే.. అలెర్ట్
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో కురుస్తున్న వర్షానికి అనేక ప్రాంతాలలో జనజీవనం స్తంభించింది. నేడు ప్రస్తుతం మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం ప్రాంతాలలో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్ సనత్ నగర్, ఎస్.ఆర్.నగర్, ఎర్రగడ్డ, అమీర్పేట, పంజాగుట్ట, బోరబండ, యూసుఫ్ గూడ, కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది.

నేడు, రేపు, ఎల్లుండి హైదరాబాద్ ఉత్తర ప్రాంతాలలో భారీ వర్షాలు
దుండిగల్, గండి మైసమ్మ, మల్లంపేట, బహదూర్ పల్లి, సూరారం, బాలానగర్, బోయిన్పల్లి, జీడిమెట్ల, సుచిత్ర, తిరుమలగిరి, ఆల్వాల్, జవహర్ నగర్, బొల్లారం, ప్యాట్ని తదితర ప్రాంతాలలో జోరుగా వర్షం కురుస్తోంది. ఇక నేడు, రేపు, ఎల్లుండి హైదరాబాద్ ఉత్తర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఇళ్ళ నుండి బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్రాఫిక్ అలెర్ట్ .. జాగ్రత్త
వర్షంలో వాహనదారులు బయటకు వచ్చి ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడొద్దు అని పోలీసులు సూచిస్తున్నారు. కరెంట్ పోల్స్, మ్యాన్ హోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఇప్పటికే వర్షం కారణంగా రోడ్లపైన ట్రాఫిక్ జామ్ నెలకొనగా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి అష్ట కష్టాలు పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+