తెలంగాణ‌ను వీడ‌ను అంటున్న వ‌రుణుడు.. మ‌రో మూడురోజులు భారీ వ‌ర్షాలే..

తెలంగాణలో రాష్ట్రంలో గ‌త కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే, మ‌రో మూడురోజుల పాటు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాత‌వార‌ణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వ‌ర్షాల వ‌ల్ల హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు నదుల‌ను త‌ల‌పిస్తున్నాయి. ప‌ట్ట‌ణంలోని పలు చెరువులు నీటితో పొంగిపొర్లుతున్నాయి. కొద్దిరోజులుగా బ్రేక్‌ తీసుకున్న వర్షం కాస్త మ‌ళ్లీ ప్రారంభ‌మైంది. రెండు రోజుల నుంచి రాష్ట్రంలో ఎడ‌తెరిపి లేకుండా ప‌లు జిల్లాల్లో వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే, ఇదే సమయంలో, హైదరాబాద్ వాతావరణ శాఖ భాగ్య‌నగర వాసులకు కీల‌క‌మైన సూచ‌న‌లు చేసింది.

ప‌ట్ట‌ణంలోని ప‌లు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులు(గురు, శుక్ర, శనివారాలు) భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చ‌రిస్తోంది. నేడు, రేపు బలమైన గాలులు వీచే అవ‌కాశం ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ భావిస్తోంది.

heavy rains for another three days in telangana

మ‌రో మూడు రోజుల పాటు హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో నిర్మల్ జిల్లా బాసరలో అత్యధికంగా 4.08 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వివ‌రించారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదైంద‌ని వెల్ల‌డించారు. రాబోయే మూడు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయ‌ని అంటున్నారు.

ప‌లు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు..

ప్రకృతి ప్ర‌కోపానికి గురైన కేర‌ళ అత‌లాకుత‌ల‌మైపోయింది. ఇక్క‌డ వ‌చ్చిన విప‌త్తుకు వందలాది మంది మరణించారు. చాలా మంది క‌నుమ‌రుగ‌యిన సంగ‌తి తెలిసిందే. దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో విప‌రీత‌మైన వ‌ర్షాల‌కు ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క కేరళ రాష్ట్రంలోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ వంటి పలు రాష్ట్రాలు భారీ వ‌ర‌ద‌ల‌తో నిండి ఉన్నాయి. ప‌లు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు కొండచరియలు విరిగిపడటంతో ప‌లు జాతీయ రహదారులను మూసివేశారు. ఇక‌, భాగ్య‌నగ‌ర విష‌యానికి నగరంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురువ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. కావున ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+