Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణాలో కుండపోత వర్షం: నేడు 21జిల్లాలలో భారీవర్షాలకు ఛాన్స్, మరో మూడురోజులూ ఇంతే!!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో కుండపోత వాన కురుస్తూనే ఉంది. గడిచిన మూడు నాలుగు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండి మత్తడి పడుతున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా, గోదావరి నదులు నీటి కుండలా మారాయి.

రానున్న మూడు రోజుల పాటు కూడా భారీ వర్షాలు

రానున్న మూడు రోజుల పాటు కూడా భారీ వర్షాలు

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని, రానున్న మూడు రోజుల పాటు మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను ఆదేశించారు.

నేడు 21 జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం


వాతావరణ శాఖ అందించిన తాజా సమాచారం ప్రకారం మంగళవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 21 జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది. మంగళవారం ఉదయం వరకు నిజామాబాద్, కామారెడ్డి, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

8 జిల్లాలలో కొనసాగుతున్న రెడ్ అలెర్ట్

8 జిల్లాలలో కొనసాగుతున్న రెడ్ అలెర్ట్


ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలను చూస్తే నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. జూలై 12వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచి 24 గంటల పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులను అప్రమత్తం చేసిన సీఎం కేసీఆర్, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

 గత 24 గంటల్లో భారీ వర్షపాతం కుమరం భీమ్ జిల్లాలోనే

గత 24 గంటల్లో భారీ వర్షపాతం కుమరం భీమ్ జిల్లాలోనే

ఇదిలా ఉంటె నిన్న కుమరం భీమ్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. కుమరం భీమ్ జిల్లాలో కెరమెరి మండలంలో 170.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొమురం భీం జిల్లా లో కెరమెరి మండలం లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, ఆ తర్వాతి స్థానంలో జైనూర్ మండలం లో 159.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది ఇక కొమురం భీం ఆసిఫాబాద్ నూట 116.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తరువాత నిర్మల్ లో జిల్లా పెంబి లో 111 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక కొమురం భీం సిర్పూర్ మండలం 105.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు చేసి ఐదో స్థానంలో ఉంది.

అనేక గ్రామాలకు రాకపోకలు బంద్.. రంగంలోకి అధికార యంత్రాంగం

అనేక గ్రామాలకు రాకపోకలు బంద్.. రంగంలోకి అధికార యంత్రాంగం

వరద సహాయక బృందాలను రంగంలోకి దించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం కెసీఆర్ సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తోంది. చాలా చోట్ల వాగులు, వంకలు పొంగి వరద రోడ్ల మీదకు రావటంతో అనేక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుధవారం వరకు స్కూళ్లకు, కళాశాలలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు రైల్వే కూడా అప్రమత్తమై దక్షిణ మధ్య రైల్వే లో మొత్తం 54 రైల్వే సర్వీసులను రేపటి వరకు రద్దు చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+