భారీ వర్షాల హెచ్చరిక పంపిన బంగాళాఖాతం!
మే నెలలో ఎండలు మండుతాయి అని అందరూ భావించిన సమయంలో ఊహించని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన కారణంగా రానున్న ఐదు రోజులు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతుండగా, రాబోయే 12 గంటల్లో అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
బంగాళాఖాతంలో వాయుగుండం.. భారీ వర్షాలు
నేడు అర్ధరాత్రికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, అది రేపు అర్ధరాత్రికి వాయుగుండంగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే 36 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతున్న కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది .

తెలంగాణా జిల్లాలకు భారీ వర్ష సూచన
మే 26వ తేదీ వరకు వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఇప్పటికే హన్మకొండ, వరంగల్, కోదాడ, సూర్యాపేట, హుజూర్నగర్ వంటి ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో పశ్చిమ, తూర్పు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టుగా వెల్లడించింది.
15 జిల్లాలకు భారీ వర్ష సూచన
నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ, నారాయణపేట, గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, హైదరాబాద్ ప్రాంతాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మొత్తం 15 జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రేపు భారీ వర్షాలకు ఛాన్స్
రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని అంచనా వేసింది. వచ్చే మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కూడా ఉత్తర, దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.












Click it and Unblock the Notifications