తెలంగాణాలో వర్షబీభత్సం; పిడుగుపాటుకు ముగ్గురు మృతి; అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అలెర్ట్!!
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్లో మాత్రమే కాకుండా తెలంగాణాలోని ఉమ్మడి వరంగల్ వరంగల్ జిల్లాలోనూ, ఆసిఫాబాద్ జిల్లాలోనూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ, సిద్ధిపేట, నల్గొండ, ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల నిన్న భారీ వర్షం కురిసింది.
హైదరాబాద్ లో జోరువాన.. ట్రాఫిక్ ఇబ్బంది
నిన్న హైదరాబాద్ జంటనగారాల్లో కురిసిన వర్షానికి ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మణికొండ,పంజాగుట్ట ఖైరాదాబాద్, దిల్ సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది.భారీ వర్షాల కారణంగా అవసరమైతే తప్ప బయటికి రావద్దని జీహెచ్ఎంసీ ప్రజలకు సూచించింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాటుతో ముగ్గురు మరణించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్ష బీభత్సం.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన అకాలవర్షం కురిసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసి ముద్దయింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజపల్లి గ్రామంలో పిడుగు పాటుకు గ్రామానికి చెందిన కంబళ్ళ శ్రీనివాస్ మృతిచెందాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. తంగళ్ళపల్లి మండలం ఇందిరానగర్ గ్రామంలోని భరత్ నగర్ చెందిన రుద్రారపు చంద్రయ్య అనే రైతుపై పొలం వద్ద పనులు చేస్తుండగా ఆయనపై పిడుగు పడి అక్కడిక్కడే మృతి చెందాడు.
వరంగల్ వర్షాలు... కూలిన భారీ వృక్షాలు
ఇక వరంగల్ లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి భారీ వృక్షాలు కూలి రోడ్లపై అడ్డంగా పడ్డాయి భద్రకాళి గుడికి వెళ్లే దారిలో భారీ వర్షం కూలి రోడ్డుకు అడ్డంగా పడడంతో గుడికి వెళ్లేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరంగల్ నగరపాలక సంస్థ డీ ఆర్ఎఫ్ సిబ్బంది రోడ్డుపై పడిన భారీ వృక్షాన్ని తొలగిస్తున్నారు.
గ్రేటర్ వరంగల్ అలెర్ట్ .. వర్షాల కారణంగా ఇబ్బందులకు కంట్రోల్ రూమ్
ఇదిలా ఉంటే భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ అప్రమత్తమైంది. ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు నగర కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో తెలిపారు. వర్షం కారణంగాచోటుచేసుకునే ఇబ్బందుల పైన ఫిర్యాదులు చేయవచ్చని టోల్ ఫ్రీ నెంబర్ 1800425 1980 అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మ్యాన్ హోల్స్ నిర్వహణ, వరద ముంపు నివారణ మొదలైన వాటిపై దృష్టి సారించాలన్నారు. విద్యుత్ సరఫరా స్తంభించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 20వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆయన అధికారులకు కీలక సూచనలు చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications