కాళేశ్వరం కేసులో స్మితా సబర్వాల్, హైకోర్టు కీలక ఆదేశాలు..!!

ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పిటీషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి పైన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించింది. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐకు విచారణ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ కమిషన్ విచారణ లో నాడు ఇరిగేషన్ శాఖ పర్యవేక్షించిన స్మితా సబర్వాల్ పేరు ప్రస్తావించారు. దీంతో, ఇదే అంశం పైన స్మితా హైకోర్టును ఆశ్రయించారు. కాగా, తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు స్మితా సబర్వాల్ కు రిలీఫ్ గా మారనున్నాయి.

ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్‌ కు తెలంగాణ హైకోర్టు లో రిలీఫ్ దక్కింది. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ తన వివరణ కోరలేదంటూ ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిపి హైకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణ అక్టోబర్ 7వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని కోరుతూ స్మితా సబర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. సబర్వాల్ పిటిషన్‌పై ఇవాళ(గురువారం) హై కోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరంపై విచారణలో తన వివరణ కోరలేదని, 8బీ, 8సీ నోటీసులు ఇవ్వలేదని స్మితా సబర్వాల్ తన పిటీషన్ లో వివరించారు. స్మితా సబర్వాల్ చర్యల గురించి ఘోష్ కమీషన్ లో ప్రస్తావన చేసింది.

high-court-key-orders-over-smith-sabarwal-petition-on-kaleswaram-report

కాళేశ్వరం నిర్మాణాలపై స్మితా సబర్వాల్ రివ్యూ చేసారని ఘోష్ కమిషన్ తెలిపింది. కొన్ని జిల్లాలు తిరిగి ఫీడ్‌బ్యాక్‌ను ఎప్పటికప్పుడూ అప్పటి సీఎం కేసీఆర్‌కి చేరవేశారని స్మిత సబర్వాల్‌పై పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొంది. ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీ హోదాలో పలు సందర్భాల్లో స్మిత సబర్వాల్ మూడు బ్యారేజీలను సందర్శించారని కమిషన్ గుర్తుచేసింది. కాళేశ్వరంపై అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు జారీ చేయడంలో స్మిత సబర్వాల్ కీలకపాత్ర పోషించారని కమిషన్ చెప్పుకొచ్చింది. నిజానిజాలను కేబినెట్ ముందు పెట్టనందుకు స్మిత సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌లో పేర్కొంది. కాగా, ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు స్మితా సబర్వాల్ కు బిగ్ రిలీఫ్ ఇవ్వనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+