నిద్రపోతున్నారా..హైకోర్టు సీరియస్..!!
స్కూల్‌లో ఫుడ్ పాయిజనింగ్ పై హైకోర్టు సీరియస్ అయింది. ఈ వ్యవహారం చాలా సీరియస్ అంశంగా పరిగణించింది. ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంటే అధికారులు నిద్ర పోతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంలో మూడు సార్లు ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీసింది. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని.. ప్రభుత్వం కౌంటర్ దాఖలు విషయం పైనా హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని హైకోర్టులో పిల్ దాఖలైంది. పిటి షనర్ తరఫున సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో తరుచూ భోజనం వికటిస్తుందని ప్రభాకర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్కూల్‌లో ఫుడ్ పాయిజనింగ్ చాలా సీరియస్ అంశమని సీజే జస్టిస్ అలోక్ అరాధే వ్యాఖ్యానిం చారు. పిల్లలు చనిపోతే గానీ ఫుడ్ పాయిజనింగ్ పైన స్పందించరా అంటూ అధికారుల పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశిస్తేనే అధికారులు పని చేస్తారా అంటూ సీరియస్ అయింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే ఐదు నిమిషాల్లో హాజరవుతారని పేర్కొంది.

అధికారులకు కూడా పిల్లలు ఉన్నారని వ్యాఖ్యానించింది. మానవతా దృక్పథంతో వ్యవహరించాల ని హైకోర్టు సూచించింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ పాయిజనింగ్ కేసులు వెలుగు చూస్తున్నా యి. మానగూరు జడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 30 మంది విద్యార్థులు వాంతులు, తలనొప్పి, కడుపు నొప్పితో బాధపడగా.. వెంటనే వారిని మక్తల్ ఆసుపత్రికి తరలించారు. పాఠశాలలో వారం వ్యవధిలోనే మరోసారి ఫుడ్ పాయిజనింగ్ జరిగింది.
అదే విధంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గురుకుల పాఠశాలలోనూ ఫుడ్ పాయిజనింగ్ జరిగిన విషయం తెలిసిందే. 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో చౌదరి శైలజ అనే విద్యార్థి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది. దాదాపు 20 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్సపొందిన విద్యార్థిని గత సోమవారం తుదిశ్వాస విడిచింది. దీని పైన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక, ఇప్పుడు హైకోర్టు జోక్యంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఆదేశిస్తుందనేదీ చూడాల్సి ఉంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications