వైఎస్ షర్మిలపై భగ్గుమన్న హిజ్రాలు: చెప్పులతో కొట్టి, షర్మిల ఫ్లెక్సీ దగ్ధం; సీరియస్ వార్నింగ్!!
వైఎస్ షర్మిలపై భగ్గుమన్న హిజ్రాలు చెప్పులతో కొట్టి, షర్మిల ఫ్లెక్సీ దగ్ధం చేశారు. ఆపై ఖబడ్దార్ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
వరంగల్ నగరంలో వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధినేత్రి వైయస్ షర్మిలపై ఆగ్రహ జ్వాలలు మినుముడుతున్నాయి. హిజ్రాలు వైయస్ షర్మిల తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైయస్ షర్మిల తక్షణం తమకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

షర్మిల కొజ్జా వ్యాఖ్యలపై హిజ్రాలు ఫైర్
మొన్న మహబూబాబాద్ పాదయాత్రలో వైఎస్ షర్మిల శంకర్ నాయక్ ను కొజ్జా అంటూ ఘాటుగా విమర్శించారు. శంకర్ నాయక్ తనను శిఖండి అని కొజ్జా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడిన షర్మిల ఎవడ్రా కొజ్జా.. హామీలు అమలు చేయని నువ్వు కదా కొజ్జా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రైతు రుణమాఫీ చెయ్యని మిమ్మల్ని కొజ్జాలు కాకుంటే మరేమంటారు అంటూ ప్రశ్నించారు. ఆరు నెలల్లో పోడు పట్టాలు ఇవ్వని మీరు కొజ్జాలు కాకపోతే మరేమవుతారు అంటూ వైయస్ షర్మిల తీవ్ర స్థాయిల వ్యాఖ్యలు చేశారు. ఇక దీంతో వరంగల్లోని హిజ్రాలు షర్మిల వ్యాఖ్యల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వరంగల్ లో షర్మిల ఫ్లెక్సీ చెప్పులతో కొట్టి దగ్ధం చేసి నిరసన
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిలఇటీవల మహబూబాబాద్ లో నిర్వహించిన పాదయాత్రలో హిజ్రాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలని వరంగల్ నగరంలోని హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు. వైయస్ షర్మిల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన హిజ్రాలువరంగల్ హెడ్పోస్ట్ ఆఫీస్ జంక్షన్ లో వైయస్ షర్మిల ఫ్లెక్సీలను చెప్పులతోకొడుతూ నిరసన వ్యక్తం చేశారు.ఆపై హిజ్రాలువైయస్ షర్మిల చిత్రాన్ని దగ్ధం చేశారు.వైయస్ షర్మిల బహిరంగ క్షమాపణ చెప్పాలని,లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వైయస్ షర్మిలకు హిజ్రాలుహెచ్చరిక జారీ చేశారు. ఇక ఈ నిరసన కార్యక్రమంతో స్థానికంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది.

కొజ్జా అంటూ తక్కువగా మాట్లాడితే ఊరుకోము: లైలా
హిజ్రాలను చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదని, హిజ్రాలలో చదువుకున్న వారు, విద్యావంతులు, మేధావులు ఎందరో ఉన్నారని, హిజ్రాలు నేడు సమాజంలో మిగతా కమ్యూనిటీలలానే గౌరవప్రదంగా జీవిస్తున్నారని హిజ్రాల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లైలా పేర్కొన్నారు. హిజ్రాల గురించి మాట్లాడేటప్పుడు వారి జీవితం ఏంటో వారితో కలిసి ఉండి తెలుసుకోవాలని, నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజకీయ నాయకులు రాజకీయాలు చేసుకోవచ్చు కానీ కొజ్జా.. కొజ్జా అంటూ తమ కమ్యూనిటీని కించపరిచి మాట్లాడితే ఊరుకునేది లేదని హిజ్రాలు హెచ్చరిస్తున్నారు.
ఖబడ్దార్ షర్మిల.. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పాదయాత్ర అడ్డుకుంటాం
హిజ్రాల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే పాదయాత్రలు చెయ్యనీయమని వార్నింగ్ ఇచ్చారు. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్ర ఎక్కడ చూసినా అడ్డుకుని తీరుతామని ఖబడ్దార్ అంటూ లైలా హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే వైఎస్ షర్మిల పాదయాత్రకు బిఆర్ఎస్ నాయకులనుండి హెచ్చరికలు వ్యక్తమౌతూ ఉండగా, ప్రస్తుతం హిజ్రాలు కూడా వైయస్ షర్మిల పాదయాత్ర విషయంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయడం ప్రధానంగా కనిపిస్తుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ షర్మిల పాదయాత్రలో ముందుకు వెళ్లగలుగుతారా? అన్నది తెలియాల్సి ఉంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications