నల్లమల గుహల్లో క్షుద్ర పూజలు: ఆ ఐదు మృతదేహలు కర్ణాటక మహిళలవేనా?

నాగర్‌కర్పూల్ జిల్లా వటవర్లపల్లి గ్రామానికి సమీపంలోని 20 కిలోమీటర్ల దూరంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని అక్క మహదేవి గుహల సముదాయంలో ఐదు మహిళల మృతదేహలు మంగళవారం నాడు వెలుగు చూశాయి.

నాగర్‌కర్నూల్: నాగర్‌కర్పూల్ జిల్లా వటవర్లపల్లి గ్రామానికి సమీపంలోని 20 కిలోమీటర్ల దూరంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని అక్క మహదేవి గుహల సముదాయంలో ఐదు మహిళల మృతదేహలు మంగళవారం నాడు వెలుగు చూశాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

హైద్రాబాద్‌ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొంది.ఈ ఘటన జరిగిన ప్రాంతం హైద్రాబాద్‌కు సుమారు 200 కి.మీ దూరంలో ఉంటుంది.

అక్క మహదేవి గుహల ప్రాంతంలో గుప్తనిధులు లభిస్తాయనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం కారణంగా క్షుద్ర పూజలు చేసి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అక్కదేవి గుహల సముదాయంలో 5 మృతదేహలు

అక్కదేవి గుహల సముదాయంలో 5 మృతదేహలు

హైదరాబాద్- శ్రీశైలం దారిలో నాగర్ కర్నూల్ జిల్లా వటవర్ల పల్లి గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఐదు మృతదేహాలు కన్పించాయి. అక్క మహాదేవి గుహల సముదాయంలో పుర్రెలు, ఎముకలు, నిమ్మకాయలు, దుస్తులు, చెప్పులు ఉన్నట్లు పశువుల కాపరులు ఐదు రోజుల క్రితం చెప్పటంతో విషయం బయటకు వచ్చింది.

కర్ణాటకకు చెందిన మహిళలా?

కర్ణాటకకు చెందిన మహిళలా?

అక్క మహదేవి గుహల వద్ద ఐదు మహిళల మృతదేహలు లభ్యమయ్యాయి. అయితే వీరంతా కర్ణాటక రాష్ట్రానికి చెందినవారై ఉంటారని పోలీసులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.ఇక్కడ లభ్యమైన పుర్రెలు సుమారు 30 ఏళ్ళలోపు మహిళలకు చెందినవని పోలీసులు భావిస్తున్నారు. అయితే చనిపోయిందెవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

గుప్తనిధుల కోసమేనా

గుప్తనిధుల కోసమేనా

అక్క మహదేవి గుహల ప్రాంతంలో భారీగా గుప్త నిధులుంటాయని ప్రచారం ఉంది. అయితే ఈ గుప్త నిధులను వెలికితీసేందుకే మహిళలను బలి ఇచ్చారా.. లేక ఇతర త్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. చనిపోయిన వారి ఆనవాళ్ళు మాత్రం కన్పిస్తున్నాయి.

మత్తు మందిచ్చి చంపారా

మత్తు మందిచ్చి చంపారా

నెల రోజుల క్రితం గుప్త నిధులు, తాంత్రిక శక్తుల కోసమే మహిళలకు మత్తు మందులు ఇచ్చి బ్లేడులతో కోసి బలి ఇచ్చి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మృతదేహాలను జంతువులు తినగా పుర్రెలు మాత్రమే మిగిలాయని అక్కడి స్థానికులు అభిప్రాయపడుతున్నారు. శ్రీశైలం వెళ్ళే పర్యాటకులు అక్క మహదేవి గుహలను దర్శించుకొనేందుకు వస్తుంటారు. అయితే ఈ ప్రాంతంలోకి వెళ్లేందుకు భయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+