హోలీ సంబరాలు షురూ.. దేశ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హోలీ శుభాకాంక్షలు

తెలంగాణా: దేశవ్యాప్తంగా సంతోషాల కేళి.. సంబరాల హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. నేడు, రేపు హోలీ సంబరాలను జరుపుకుంటున్న వేళ అంతా వర్ణమయం కాబోతుంది. వసంతానికి స్వాగతం పలుకుతూ రంగులు పూసుకుంటూ జనాలు సంతోషంగా హోలీ ఆడుతున్నారు. చిన్నా, పెద్దా.. పేద , ధనిక తారతమ్యం లేకుండా అంతా కలిసి వేడుకలు చేసుకుంటున్నారు. అయితే సహజ రంగులతో హోలీ ఆడటం మంచిదని పలువురు పదేపదే చెప్తున్నారు.

వసంత రుతువుకు స్వాగతం పలుకుతూ అందరి జీవితాలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజలందరూ బేధ భావాలు వీడి పరస్పర ప్రేమాభిమానాలతో సంతోషంగా మోదుగు పూల వంటి సహజ సిద్ధమైన రంగులతో వసంత రుతువుకు నాందిగా మొదలైన హోలీ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ రాష్ట్ర దేశ ప్రజలందరికీ హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణా సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

Holi celebrations started: BRS chief , CM KCR wishes Holi to the people of nation

ఈ సందర్భంగా దేశ ప్రజల్లో నూతన ఉత్సాహం వెల్లి విరియాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. సహజసిద్ధమైన రంగులతో హోలీ పండుగను జరుపుకోవాలని, పరస్పర ప్రేమ, సహృద్భావం, ఆప్యాయతలతో హోలీ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. చిగురించే ఆశలతో ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లోకి కొత్తదనాన్ని ఆహ్వానించే హోలీ పండుగ భారతీయ సంప్రదాయమని ఇది ఎంతో అందంగా ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు పాటించి హోలీ పండుగను జరుపుకోవాలని పేర్కొన్న కేసీఆర్, పిల్లలకు పెద్దలు దగ్గరుండి జాగ్రత్తలు చెప్పాలని, రంగులు కళ్ళల్లో పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Holi celebrations started: BRS chief , CM KCR wishes Holi to the people of nation

అంతేకాదు హోలీ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు చిన్నారుల జాజిరి ఆటలతో, నవరాత్రుల కోలాటాలు చప్పట్లతో హోరెత్తుతాయని పేర్కొన్నారు. మన స్వరాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ప్రగతి కార్యాచరణ తెలంగాణలో ఉన్న దళిత, బహుజన, సకల జనుల జీవితాలలో వెలుగులు నింపిందని, వారి జీవితాన్ని రంగుల మయం చేసిందని తెలిపారు. దేశంలోని ప్రజలందరి జీవితాలలో కొత్త వెలుగులు నిండే వరకు, వారి కొత్త జీవితం వెల్లి విరిసే వరకు తమ కృషి కొనసాగుతుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+