Holi విచిత్ర సాంప్రదాయాలు: తెలంగాణాలో పిడిగుద్దులు, కాశీలో చితా భస్మాలతో రంగుల కేళి!!
హోలీ స్పెషల్ గా వింత సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో ముష్టిఘాతాలు, కాశీలో చితా భస్మ హోలీ వేడుకలు ప్రత్యేకంగా జరగనున్నాయి.
దేశవ్యాప్తంగా హోలీ పండుగను అందరూ ఘనంగా జరుపుకుంటున్నారు. ఈసారి హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అన్న సందిగ్ధం నేపథ్యంలో నేడు, రేపు సంబరాలను జరుపుకుంటున్న వారు లేకపోలేదు. ప్రతి ఒక్కరూ రంగులు పూసుకుని సంతోషంగా జరుపుకునే ఈ పండుగకు ఒక్కొక్క చోట ఒక్కొక్క వింత ఆచారాలు నేటికీ కొనసాగుతున్నాయి. అనాదిగా వస్తున్న ఆచారాలుగా వాటికి చాలా ప్రాధాన్యతను ఇస్తూ అనేక ప్రాంతాల ప్రజలు హోలీ జరుపుకుంటున్నారు.
హోలీనాడు పిడిగుద్దులాట
హోలీ పండుగ అంటేనే సంబరాల పండుగ.. రంగులతో జరుపుకునే సంతోషాల వేడుక. అటువంటి హోలీ పండుగను తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో హున్సా గ్రామంలో పిడిగుద్దులతో జరుపుకుంటారు. హోలీ పండుగ వచ్చిందంటే చాలు హున్సా గ్రామంలోని సాంప్రదాయ ఆట పిడుగుద్దులాట మొదలవుతుంది. గ్రామస్తులందరూ కచ్చితంగా పిడుగుద్దులాట ఆడాల్సిందే. తమ గ్రామ శ్రేయస్సు కోసం, సంక్షేమం కోసం వారు ఈ ఆట ఆడటం ఆచారంగా పెట్టుకున్నారు.

హోలీకి వింత ఆచారం,,, గాయాలయ్యేలా కొట్టుకునే గ్రామం
ఒకవేళ హోలీ పండుగ రోజు వారు పిడిగుద్దులాట ఆడకపోతే ఆ సంవత్సరం గ్రామంలో ఏదైనా జరిగిందంటే, అందుకు ఆట ఆడకపోవడమే కారణమని భావిస్తూ ఉంటారు. అందుకే గ్రామంలో ఎటువంటి అరిష్టాలు జరగకుండా ఉండటం కోసం ప్రతి సంవత్సరం ఈ పిడిగుద్దులాట కచ్చితంగా ఆడతారు. ఇందులో భాగంగా మగవారంతా పిడికిళ్ళు బిగించి ఒకరినొకరు రక్తం వచ్చేలా, గాయాలయ్యేలా తెగ కొట్టుకుంటారు.

వీర లెవల్ లో కొట్టుకుని ఆపై...
ఇక ఇంతా కొట్టుకున్న, గాయాలు అవుతున్నా తమకేమీ కాలేదు అన్నట్టుగానే ముష్టి ఘాతాలతో రెచ్చిపోతారు. ఒక సంవత్సరం పొరపాటున పిడిగుద్దులాట ఆడకపోతే ఆ సంవత్సరం గ్రామంలోని ట్యాంకు కూలి నష్టం జరిగిందట.. ఇక అప్పటినుంచి, ప్రతి సంవత్సరం కచ్చితంగా పిడి గుద్దులాట ఆడి తీరాల్సిందే. హోలీ నాడు సాయంత్రం గ్రామంలోని ప్రధాన కూడళ్ళలో ఒక అరగంట పాటు దాడి చేసుకుంటారు. ఆపై పరస్పరం అలయ్‌బలయ్ చేసుకుంటారు. ఒకరితో ఒకరు స్నేహం చేస్తారు.

పిడిగుద్ధుల్లో గాయపడితే ఏం చేస్తారంటే
పిడిగుద్దుల్లో గాయపడిన వారు కామ దహన బుడిదను గాయాలకు పూసుకుంటారు. దానితో గాయాలు మానిపోతాయని బలంగా నమ్ముతారు. చాలా ఆనందోత్సాహాల నడుమ వారు పిడిగుద్దుల హోలీ పండుగను జరుపుకుంటారు. ఇక ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా హోలీ పండుగ ఆడడానికి, పిడిగుద్దులాటకు నిజామాబాద్ గ్రామం హున్సా రెడీ అయిపోయింది.

కాశీలో చితా భస్మంతో హోలీ ఆడుకునే విచిత్ర ఆచారం
ఇదిలా ఉంటే హోలీ పండుగ సందర్భంగా కాశీలోని మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్ వద్ద విచిత్రమైన సాంప్రదాయం కొనసాగుతుంది. కాశీ విశ్వేశ్వరుడి నగరమైన కాశీలో శివ భక్తులు చితా భస్మంతో హోలీ ఆడుకుంటారు. దీన్ని మసానే కీ హోలీ అని చెబుతారు. ఇక ఈ సాంప్రదాయం ఇక్కడ సాక్షాత్తు ఆ పరమశివుడు ప్రారంభించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. హర హర మహాదేవ సంకీర్తనల నడుమ మణికర్ణిక ఘాట్ లో ఈ ఉత్సవం జరుగుతుంది. శివ భక్తులు చితా భస్మంతో ఒకరికొకరు పూసుకుంటూ నాట్యం చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ మహాదేవుడి కరుణాకటాక్షం తమపై ఉంటుందని వారు బలంగా విశ్వసిస్తారు. ఇవి మాత్రమే దేశ వ్యాప్తంగా అనేక చోట్ల అనేక వింత ఆచారాలు హోలీకి కొనసాగుతున్నాయి.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications