కూకట్ పల్లిలో హోమో సెక్సువల్స్ రేవ్ పార్టీ; 44మంది యువకులు, ఇద్దరు హిజ్రాలతో రచ్చ రంబోలా!!

పోలీసులు దాడులు చేస్తున్నా,కేసులు పెడుతున్నా హైదరాబాద్ నగరంలో మాత్రం రేవ్ పార్టీల కల్చర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిత్యం ఎక్కడో ఒక చోట అశ్లీల పార్టీలకు వేదికగా భాగ్యనగరం మారుతుంది. ఇక తాజాగా హైదరాబాద్ కూకట్ పల్లి లో ఓ రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ రేవ్ పార్టీ లో షాకింగ్ విషయం ఏమిటంటే రేవ్ పార్టీలో పట్టుబడిన వారు అందరూ హోమోసెక్సువల్స్ . మొత్తం 44 మంది యువకులు, వారితో పాటు ఇద్దరు హిజ్రాలు కూడా కూకట్ పల్లి లో జరిగిన రేవ్ పార్టీలో పట్టుబడ్డారు.

కూకట్ పల్లిలో రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు, 44మంది యువకులు, ఇద్దరు హిజ్రాలు అరెస్ట్

కూకట్ పల్లిలో రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు, 44మంది యువకులు, ఇద్దరు హిజ్రాలు అరెస్ట్

కూకట్ పల్లి లోని వివేకానంద నగర్ లోని ఓ ఇంటి పై పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడి చేశారు ఎస్వోటీ పోలీసులు. ఇక దాడి చేసిన పోలీసులు ఆ ఇంట్లో జరుగుతున్న తంతు చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన రేవ్ పార్టీలో పెద్దఎత్తున మద్యం బాటిల్స్ తో పాటు, హుక్కా బాటిల్స్, కండోమ్ ప్యాకెట్లు ఉన్నట్టుగా పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 44 మంది యువకులు, ఇద్దరు హిజ్రాలతో కలిసి జరిగిన ఈ పార్టీలో యువకులు రచ్చ రంబోలా చేసినట్టు తెలుస్తుంది. ఈ పార్టీలో యువతులు లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు వారిని విచారించారు.

పార్టీలో వారంతా హోమో సెక్సువల్స్

పార్టీలో వారంతా హోమో సెక్సువల్స్

దీంతో వారంతా స్వలింగ సంపర్కులని తేలింది. వారు పలు యాప్ ల ద్వారా పరిచయమై అంతా కలిసి ఒక చోట పార్టీ చేసుకుంటున్నట్లు నిర్ధారించారు పోలీసులు. బ్ల్యూడ్, లోకంటో, మీట్ మీ యాప్ ల ద్వారా హోమోసెక్సువల్స్ అందరూ కలుసుకున్నట్టు పోలీసులు వివరించారు. ఇక వీరంతా ప్రతి వీకెండ్ పార్టీలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఒక్కొక్కరు 1000 రూపాయలు చెల్లించి యువకులు ఈ పార్టీలో పాల్గొన్నట్టు చెప్తున్నారు. కొందరు ఈ పార్టీలను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.

చాలా మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు.. తరచూ వీకెండ్స్ పార్టీ

చాలా మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు.. తరచూ వీకెండ్స్ పార్టీ

హోమో సేక్సువల్స్ రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో చాలామంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్న యువకులు కూడా ఉన్నట్టు సమాచారం. వీరంతా వారి కుటుంబాలకు తెలియకుండా ఈ హోమోసెక్సువల్స్ పార్టీలో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ఈ యువకులంతా ఒక బ్యాచ్ గా ఏర్పడి తరచూ వీకెండ్లో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారని, రేవ్ పార్టీల పేరుతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదు అందడంతో పోలీసులు రైడ్ చేసినట్టు చెబుతున్నారు. ఇక ఈ పార్టీ నిర్వహించిన ఇమ్రాన్, దయాళ్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Recommended Video

    Special Report on Trs Party Flag Festival | Oneindia Telugu
     ఎక్కడ బండారం బయట పడుతుందో అని హోమో సెక్సువల్స్ భయం

    ఎక్కడ బండారం బయట పడుతుందో అని హోమో సెక్సువల్స్ భయం

    రేవ్ పార్టీలో పాల్గొన్న వారందరినీ అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారణ నిమిత్తం కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఇక హోమోసెక్సువల్ పార్టీలో పాల్గొన్న వారంతా పోలీసులకు పట్టుబడిన బాధ అటుంచి తమ కుటుంబ సభ్యులకు ఈ విషయం ఎక్కడ తెలుస్తుందో అని లబోదిబోమంటున్నట్లుగా సమాచారం. ఇక తాజా భారీ హోమో సెక్సువల్స్ పార్టీ రేపిన కలకలంతో నగరంలో హోమో సెక్సువల్స్ బాగా పెరిగిపోయారన్న భావన వ్యక్తం అవుతుంది. సమాజం ఎటు వైపు ప్రయాణం చేస్తుందన్న అనుమానం కలుగుతుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+