దసరా పండుగకి జోర్దార్ లిక్కర్ సేల్స్.. మందుబాబుల పండుగలో ఈ జిల్లా టాప్!
దసరా పండుగ వచ్చిందంటే విందులు, దావతులు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు సర్వసాధారణంగా జరిగేదే. తెలుగు రాష్ట్రాలలో విజయదశమి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సంవత్సరం దసరా పండుగకు జనాలు మంచి ఊపు మీద ఉన్నారు. దసరా వచ్చిందయ్యా సరదా తెచ్చిందయ్యా అంటూ జోష్ లో ఉన్న మద్యం ప్రియులు లిక్కర్ వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తున్నారు.
దసరా పండుగకు విపరీతమైన లిక్కర్ సేల్స్
దసరా పండుగకు ముందు మూడు రోజుల్లోనే ఎన్నడూ లేనంతగా విపరీతమైన సేల్స్ జరిగాయి అంటే జనాలు ఎంజాయ్మెంట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దసరా పండుగ సందర్భంగా గతేడాది కంటే ఈ సంవత్సరం తెలంగాణలో లిక్కర్ సేల్స్ జోరుగా సాగాయి. రాష్ట్రవ్యాప్తంగా బిజినెస్ అవర్లలో సగటున ప్రతి గంటకు 25 వేల కేసులు చొప్పున మద్యం అమ్ముడుపోయినట్టుగా ఎక్సైజ్ అధికారులు చెబుతున్న లెక్కలు.

గత దసరా కంటే ఈ ఏడాది భారీగా లిక్కర్ సేల్స్
25 కేసుల లిక్కర్ అంటే 3 లక్షల ఫుల్ బాటిల్స్. నిన్న శుక్రవారం సాయంత్రానికి మొత్తం 852 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయని , గత దసరాతో పోలిస్తే ఈ సంవత్సరం 100 కోట్ల రూపాయల అదనంగా ఎక్సైజ్ శాఖకు ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
వారం రోజుల వ్యవధిలో ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం
పండుగ వేళ విందు వినోదాలలో ఎంజాయ్ చేయాలని భావించేవారు కేవలం ఏడు రోజుల వ్యవధిలో 8.5 లక్షల కేసుల లిక్కర్ 13 లక్షల కేసుల బీర్లు కొనుగోలు చేశారు. ఇక ఈ అమ్మకాల ద్వారా మొత్తం ఎనిమిది వందల యాభై రెండు కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్టు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.
నేడు భారీగా లిక్కర్ సేల్స్
దసరా కావడంతో ఈరోజు విక్రయాలు మరింత ఎక్కువగా జరుగుతాయని అంచనా వేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2260 మద్యం దుకాణాలు ఉండగా, 1171 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటికి అనుబంధంగా చట్ట విరుద్ధంగా నడిచే బెల్టు దుకాణాలు 80 వేల వరకు ఉండొచ్చని ఒక అంచనా ఉంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాప్ లలోను బార్ అండ్ రెస్టారెంట్లలోను హంగామా కొనసాగుతుంది.
ఈ ఏడాది లిక్కర్ సేల్స్ లో టాప్ లో ఇదే
దసరా పండగ సందర్భంగా వచ్చిన బంధు జనులతో మద్యం ప్రియులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సంవత్సరం దసరా మద్యం విక్రయాలలో గ్రేటర్ హైదరాబాద్ టాప్ లో నిలువగా, కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. మహబూబ్ నగర్, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలో మాత్రం పోలిస్తే ఈ సంవత్సరం సగటున ఏడు శాతం విక్రయాలు తగినట్టు ఎక్సైజ్ శాఖ నివేదికలలో వెల్లడయింది.












Click it and Unblock the Notifications