వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం... స్ట్రెచర్ ఇవ్వకపోవటంతో భార్యను భుజాలపై మోసుకెళ్ళిన భర్త!!

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి పేరుకు పెద్దాస్పత్రి అయినా అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం ఆసుపత్రికి వచ్చే వారిని ఇబ్బందులకు గురి చేస్తుంది. పేదల కోసం సేవలు అందించాల్సిన ఆసుపత్రిలో, చికిత్స కోసం వస్తున్న పేదల బాధలు వర్ణనాతీతంగా తయారయ్యాయి. ఎంజీఎం ఆస్పత్రిలో ఆసుపత్రి నిర్వహణలో ఉన్న డొల్లతనం ఎప్పటికప్పుడు అనేక ఘటనలతో బయట పడుతూనే ఉంది.

ఇక తాజాగా నడవలేని స్థితిలో ఉన్న రోగికి స్ట్రెచర్ కావాలని ఆసుపత్రికి తీసుకు వెళ్లిన భర్త ఆసుపత్రి సిబ్బందిని అడిగినా, వారు ఇవ్వకపోవడంతో భార్య ను వీపు పైకి ఎక్కించుకొని మోసుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి చోటు చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.

 mgm

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు చెందిన లక్ష్మీ అనే వృద్ధురాలికి నెల రోజుల కిందట ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యులు ఆపరేషన్ చేసి అరికాలు తొలగించారు. ఆ తరువాత పేషెంట్ ను మళ్ళీ నెల రోజుల తర్వాత వచ్చి చెకప్ చేయించుకొని వెళ్లాలని సూచించారు. దీంతో నేడు భర్త భార్యను ఆసుపత్రికి ఆటోలో తీసుకు వచ్చాడు.

అయితే ఈ రోజు సదరు వృద్ధురాలిని చూడడానికి వైద్యులు అందుబాటులో లేరని, రేపు రావాలని అక్కడున్న సిబ్బంది చెప్పారు. దీంతో కాలు బాగోలేని, నడవలేని భార్యను బయటకు తీసుకు వెళ్లడానికి స్ట్రెచర్ కావాలని అడిగాడు. అయితే ఆసుపత్రి సిబ్బంది స్ట్రెచర్ ఇవ్వకపోవడంతో విధిలేని పరిస్థితిలో భార్యను భుజాలపైకి ఎక్కించుకొని మోసుకుంటూ బయటకు తీసుకు వెళ్ళాడు.

ఇక ఈ ఘటనపై అక్కడున్న రోగుల బంధువులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మానవత్వం తో కూడా వైద్య సిబ్బంది ప్రవర్తించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆయన వయసు, పడుతున్న అవస్థను దృష్టిలో పెట్టుకుని అయినా ఆసుపత్రి సిబ్బంది సహకరించవలసిందని వారు అంటున్నారు. మరి ఈ ఘటనపై ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ ఏవిధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+