భార్యకు మరొకడితో సంబంధం: భర్త మృతి, హత్య చేశారా?
భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాదులోని సంతోష్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది.
హైదరాబాద్: భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, అతని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన హైదరాబాదులోని సంతోష్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. సంతోష్‌నగర్ పోలీసు స్టేషన్ ఎస్సై సత్యనారాయణ ఇందుకు సంబంధించిన వివరాలను అందిచారు.
న్యూ రక్షాపురం కాలనీలో నివసించే గోపాల్ తన భార్య పరాయి పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని మనస్తాపం చెంది ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. న్యూ రక్షాపురం కాలనీలో ఆరునెలల నుంచి కార్పెంటర్ పని చేసే గోపాల్(35)కు భార్య, ఏడేళ్ళ కుమారుడు ఉన్నారు. ఇతనికి ఎనిమిదేళ్ళ క్రితం పెళ్లయింది.

గతంలో మహబూబ్‌నగర్‌కు దగ్గరలోని మూసాపేటలో చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. ఆ సమయంలోనే మృతుడి భార్యకు పాల వ్యాపారితో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో అక్కడ వ్యాపారం మానేసి హైదరాబాద్ రక్షాపురం వచ్చేశారు.
అయినా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. దాంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. రెండు రోజుల క్రితం భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో గోపాల్ ఆత్మహత్య చేుకున్నాడు. ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది.
తన చావుకు కారణం తన భార్య, రాజు అనే వ్యక్తి కారణమని సూసైడ్ నోటులో ఆరోపిస్తూ వారిద్దరి మొబైల్ నెంబర్లు కూడా రాశాడు. గత మూడేళ్లుగా తనకు మనశ్శాంతి లేకుండా పోవడంతో తాను, తన కుమారుడు తనువులు చాలిస్తున్నట్లు అతను రాశాడు.
మృతుడు గదిలో ఉన్న ఫ్యాన్ కొక్కేనికి ఉరి వేసుకున్నా, ముఖం నిండా ముసుగు ఉండటంతో ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే అనుమానం కలుగుతోంది. వైద్యుల నివేదిక వచ్చిన తరువాతే తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
-
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!!












Click it and Unblock the Notifications