బాచుపల్లి జంక్షన్‌ ఫ్లైఓవర్‌.. ఆ మార్గాల్లో ట్రాఫిక్ సమస్యకు చెక్.. త్వరలోనే ప్రారంభం!

హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్. వేగంగా అభివృద్ధి చెందుతున్న, నిత్యం ట్రాఫిక్ ఎక్కువగా ఉండే బాచుపల్లి ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించే ఉద్దేశ్యంతో నిర్మించిన ఆరు లేన్ల ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ను త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనుంది.

ట్రాఫిక్ రద్దీ తీర్చేలా బాచుపల్లి జంక్షన్ ఫ్లైఓవర్

బాచుపల్లి జంక్షన్ ప్రాంతం గత కొన్ని సంవత్సరాలుగా భారీగా అభివృద్ధి చెందింది. మియాపూర్, నిజాంపేట్, గండిమైసమ్మ, గాజులరామారం, బౌరంపేట్ వంటి ప్రాంతాల నుంచి రోజూ వేలాది వాహనాలు ఈ జంక్షన్‌ గుండా ప్రయాణిస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో తీవ్ర ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడి, వాహనదారులు గంటల వ్యవధిలో ఇరుక్కుపోయే సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మూడు సంవత్సరాల క్రితం హెచ్‌ఎండీఏ ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

Hyderabad Bachupally Flyover ready for inauguration Six-lane structure built at 141 crore by HMDA

ఫ్లైఓవర్‌కు రూ.141 కోట్లు ఖర్చు

సుమారు 1.3 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌కు రూ.141 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ.71 కోట్లు నేరుగా ఫ్లైఓవర్ నిర్మాణానికి వినియోగించగా, మిగిలిన నిధులు భూసేకరణ, ఇతర అనుబంధ పనులకు ఉపయోగపడ్డాయి. ఫ్లైఓవర్ పూర్తి కావడంతో మియాపూర్ నుంచి గండిమైసమ్మ వైపు వెళ్లే వాహనాలు, నిజాంపేట్, మల్లంపేట్ మార్గాల్లో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గనుంది.

ఆ మార్గాల్లో రోడ్డు ప్రయాణం సురక్షితం

స్థానికులు ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తి కావడం వల్ల బాచుపల్లి మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లోని రోడ్డు ప్రయాణం సురక్షితంగా, సాఫీగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇది కేవలం ట్రాఫిక్ సమస్య పరిష్కారం మాత్రమే కాకుండా, ప్రాంత అభివృద్ధికి కూడా ఊతం ఇస్తుంది.

ఇందిరమ్మ ఇళ్ళ రెండో దశపై కీలక అప్డేట్ ఇచ్చిన మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్ళ రెండో దశపై కీలక అప్డేట్ ఇచ్చిన మంత్రి పొంగులేటి

మెరుగ్గా హైదరాబాద్ ఉత్తర ప్రాంత ట్రాఫిక్ వ్యవస్థ

హెచ్‌ఎండీఏ అధికారులు ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. హైదరాబాద్‌ను మరింత ఆధునిక నగరంగా మార్చడంలో ఇటువంటి మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాచుపల్లి ఫ్లైఓవర్ ప్రారంభం తర్వాత హైదరాబాద్ ఉత్తర ప్రాంత ట్రాఫిక్ వ్యవస్థ మరింత మెరుగుపడనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+