వాకింగ్ చేస్తూ వెళుతున్న మహిళలను డీకొట్టిన కారు: ఇద్దరు మృతి, గగుర్పొడిచే వీడియో

హైదరాబాద్: నగరంలోని బండ్లగూడ జాగీర్ వద్ద వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి కారణమైన నిందితుడిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసింది. బద్రుద్దీన్ ఖాదిరి అనే యువకుడు తన పుట్టినరోజు వేడుక జరుపుకునేందుకు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి మంగళవారం ఉదయం మాసబ్ ట్యాంక్ నుంచి మోయినాబాద్ వైపు కారులో బయల్దేరాడు.

బండ్లగూడ సన్‌సిటీ వద్దకు రాగానే అతి వేగంగా వెళ్తున్న కారు.. అదుపుతప్పి వాకింగ్ చేస్తున్న ముగ్గురు మహిళలను ఢీకొట్టింది. ఆ తర్వాత సమీపంలో ఉన్న మరో వ్యక్తిని ఢీకొట్టింది. ఘటనా స్థలంలో అనురాధ, ఆమె కుమార్తె మమత మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన కవిత, ఇంతియాజ్ లను పోలీసులు ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.

 Hyderabad: Bandlaguda car accident, two women killed

ప్రమాదంలో నుజ్జునుజ్జైన కారును క్రేన్ సాయంతో బయటకు తీశారు. కారు నడిపి ప్రమాదానికి కారణమైన బద్రుద్దీన్ ఓ ప్రైవేటు కాలేజీలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, కారులో ఓ కత్తి లభించడం గమనార్హం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది ఇలావుండగా, రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు భానుప్రకాశ్, నవీన్, నారాయణరెడ్డిగా పోలీసులు గుర్తించారు.

ముగ్గు కోసం గొడవ: ఒకరి మృతి

ఇంటి ముందు వేసిన ముగ్గు విషయంలో జరిగిన గొడవ ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీలోని ఛత్రినాక పీఎస్ పరిధిలోని శివాజీ నగర్ ప్రాంతంలో మాణిక్ ప్రభు తల్లి తన ఇంటి ముందు ముగ్గువేసి ఇంట్లోకి వెళ్లింది.

కాసేపటి తర్వాత పక్కనే నివాసం ఉంటున్న దుర్గేష్ ఇంటి నుంచి నీరు రావడంతో మాణిక్ ప్రభు తల్లి వేసిన ముగ్గు కొట్టుకుపోయింది. దీంతో మాణిక్ ప్రభు పక్కింటివారితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో రెండు కుటుంబాల వారు పిడిగుద్దులు గుద్దుకుంటూ దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన మాణిక్ ప్రభు(35) ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే క్రమంలో చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+