హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సంచలనం: ఒక్క సంతకంతో..

Hyderabad Police Commissioner: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.. సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. అత్యంత కీలకమైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను ప్రక్షాళన చేసి పడేశారు. ఒకే ఒక్క సంతకంతో.. ఆ పోలీస్ స్టేషన్‌లో పని చేసే సిబ్బంది మొత్తాన్నీ బదిలీ చేశారు.

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే అత్యంత వివాదాస్పదమైన పోలీస్ స్టేషన్‌గా చెబుతుంటారు దీన్ని. అత్యధిక ఎఫ్ఐఆర్ రేటు నమోదవుతున్నదీ ఇక్కడే. మొత్తం అయిదు సెక్టార్లుగా కార్యకలాపాలను కొనసాగిస్తోంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాలూ దీని పరిధిలోకి వస్తాయి.

Hyderabad CP Kothakota Srinivas Reddy has transferred all the staff of Punjagutta police station at once

సెక్టార్- 1: ఎల్లారెడ్డి-గూడ, హనుమాన్ టెంపుల్, ఇమామ్‌గూడ, శ్రీనగర్ కాలనీ, శాలివాహన్ నగర్, నాగార్జున నగర్, సుభాష్ నగర్, శారదా కాలనీ, ఆర్బీఐ క్వార్టర్స్, వడ్డెరబస్తీ, షాలిమార్ జంక్షన్, కేశవనగర్, అప్పర్ బస్తీ, ప్రతాప్ నగర్, శ్రీనగర్ కాలనీ పార్క్ ఏరియా, జర్నలిస్ట్ కాలనీ, ఎన్ఎఫ్‌సీఎల్, నాగార్జున సర్కిల్, నాగార్జునహిల్స్ వస్తాయి.

సెక్టార్-2 పరిధిలో అమీర్‌పేట్ ఎలిఫెంట్ హౌస్, శాంతినగర్, దుర్గానగర్, బొంగులబస్తీ, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, లాల్ బంగ్లా, అభయ్ నగర్, అపరాజిత కాలనీ, సెక్టార్-3లో బీఎస్‌ మక్తా, కుందన్‌బాగ్, మెథడిస్ట్ కాలనీ, గ్రీన్ ల్యాండ్స్ గెస్ట్ హౌస్, కుందన్‌బాగ్ ఆఫీసర్స్ కాలనీ, కంట్రీ క్లబ్, ఉమానగర్, హుస్సేన్ నగర్, రాజ్‌భవన్ చిల్లా వంటివి దీని పరిధిలోకే వస్తాయి.

సెక్టార్- 4లో మోనప్ప సర్కిల్, దుర్గా నగర్, సెంట్రల్, పంజాగుట్ట, కుమ్మరిబస్తీ జాఫర్ అలీ బాగ్, కపాడియా లేన్, సెక్టార్-5లో పంజాగుట్ట జంక్షన్, ద్వారకాపురి కాలనీ, ఎర్రమంజిల్, కేసీపీ జంక్షన్, నిమ్స్, పంజాగుట్ట మార్కెట్, హిందీ నగర్, బాలాపూర్ బస్తీ, రామకృష్ణ నగర్ వంటివి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ పరిధిలోనివే.

Hyderabad CP Kothakota Srinivas Reddy has transferred all the staff of Punjagutta police station at once

సబ్ ఇన్‌స్పెక్టర్లు, కొందరు కానిస్టేబుళ్లు సుదీర్ఘకాలంగా ఈ పోలీస్ స్టేషన్‌లో పాతుకుపోయారనే ఆరోపణలు తరచూ వస్తోన్నాయి. సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారనే విమర్శలూ లేకపోలేదు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి వారందరినీ బదిలీ చేశారు.

ఒక్క సంతకంతో 86 మంది వేర్వేరు పోలీస్ స్టేషన్లకు బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారిలో సబ్ ఇన్‌స్పెక్టర్లు బీ హరీశ్వర్ రెడ్డి, ఎన్ శివశంకర్, షేక్ నాగుల్ మీరా, మహిళా ఎస్‌ఐ కే భావన, మహ్మద్ యాసీన్ అలీ, ఎన్ గిరిధర్ ఉన్నారు. ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు.. ఇలా అందరినీ ఒకేసారి బదిలీ చేశారు.

కొత్త ఎస్ఐలుగా బీ వేణుగోపాల్- కుల్సుంపురా, బీ శివ శంకర్- నల్లకుంట, ఎం వెంకటకృష్ణ- మార్కెట్ పోలీస్ స్టేషన్ల నుంచి పంజాగుట్టకు బదిలీ అయ్యారు. బేగంపేట్, దోమల్‌గూడ, బోయిన్‌పల్లి, తుకారాంగేట్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్లల్లో ఎఎస్ఐలుగా పని చేస్తోన్న వారిని ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+