అక్బరుద్దీన్‌పై కేసు: సీపీ స్పందన ఇదే, ఈసీని కలిసిన ఎంఐఎం నేతలు
హైదరాబాద్: ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ (Akbaruddin Owaisi)పై సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్లు కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. సీఐ శివచంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మెయిన్‌బాగ్‌లో ఎంఐఎం(MIM) బహిరంగసభ ఏర్పాటు చేసింది.
సభ బందోబస్తు పర్యవేక్షించేందుకు సీఐ శివచంద్ర వెళ్లారు. రాత్రి 10 గంటలు కావస్తుండటంతో సభ నిలిపివేయాలని చెప్పేందుకు సీఐ స్టేజీపైకి వెళ్లారు. సభకు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు మాత్రమే అనుమతి ఉండటంతో.. ఆ విషయాన్ని అక్బరుద్దీన్‌కు చెప్పేందుకు సీఐ శివచంద్ర ప్రయత్నించారు.

అయితే,అక్బరుద్దీన్ ఒవైసీ సదరు పోలీసు అధికారిని ఉద్దేశిస్తూ బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. 'ఇన్‌స్పెక్టర్ సాబ్.. నా దగ్గర వాచ్ ఉంది. దయచేసి ఇక్కడ్నుంచి వెళ్లండి' అంటూ పోడియం నుంచి వేదిక వైపు వెళ్లి పోలీసు అధికారిని హెచ్చరించారు. తనను మాట్లాడకుండా అడ్డుకునేవారు ఇంకా పుట్టలేదని.. తాను ఒక్క సిగ్నల్ ఇస్తే.. ఇక్కడున్నవారంతా పోలీసు అధికారిని పరిగెత్తిస్తారంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
'కత్తులు, బుల్లెట్లు ఎదుర్కొంటే నేను బలహీనుడిని అయ్యానని అనుకుంటున్నావా' నాలో చాలా ధైర్యం ఉంది. ఐదు నిమిషాలు మిగిలి ఉన్నాయి. ఐదు నిమిషాలు మాట్లాడతాను. నన్ను ఎవరూ ఆపలేరు. నేను సిగ్నల్ ఇస్తే మీరు ఇక్కడ్నుంచి పారిపోతారు. అలా చేద్దామా?' అంటూ అక్బరుద్దీన్ ఒవైసీ హెచ్చరికలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ క్రమంలో అక్బరుద్దీన్ తనను చూసిన వెంటనే స్టేజీ దిగి వెళ్లాలని.. తన విధులకు ఆటంకం కలిగించడంతో పాటు రెండు మతాల మధ్య రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని సీఐ శివచంద్ర ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అక్బరుద్దీన్‌పై కేసు నమోదైంది.
కాగా, బెదిరింపుల నేపథ్యంలో అక్బరుద్దీన్ ఒవైసీపై ఐపీసీ 06, 153 ఐపీసీ, 505 (2), 506, ప్రజాప్రాతినిథ్య చట్టం, 1951లోని సెక్షన్ 125 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ అంశంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తన సోదరుడిని ఎందుకు మాట్లాడనీయకుండా చేశారని ప్రశ్నించారు. దీనిపై ఈసీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, ఈ ఘటనపై హైదారాబాద్ సీపీ శాండిల్యా(Sandilya) స్పందించారు. గత రాత్రి జరిగిన ఎంఐఎం సమావేశంపై విచారణ చేస్తున్నామని తెలిపారు. అక్బరుద్దీన్ పై కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అక్బరుద్దీన్ విజ్ఞత లేకుండా మాట్లాడారని అన్నారు. ప్రతి రోజు పోలీసులు ప్రజల కోసమే విధులు నిర్వర్తిస్తున్నారని.. మర్యాదగా చెప్తే మాకు గౌరవంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈసీని కలిసిన ఎంఐఎం నేతలు
ఇది ఇలావుండగా, అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు అవడంతో మజ్లిస్ నేతలు సీఈఓ వికాస్ రాజ్‌ను కలిశారు. పోలీసులు అక్బరుద్దీన్ ప్రచారానికి ఆటంకం కల్గించారని.. సమయానికి ముందే సమావేశాన్ని ముగించాలని చెప్పారని ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటించని పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications