ఆహార కల్తీ హత్యాయత్నమే.. వారికి సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్లో ఆహార కల్తీపైన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై ఆహార కల్తీ పైన పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న వారిపైన నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఆహార కల్తీ మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నామని సజ్జనార్ ప్రకటించారు. ఇక ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని ఆయన తేల్చి చెప్పారు.

ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న సీపీ సజ్జనార్
ఆహార కల్తీ నియంత్రణకు తీసుకోవలసిన కార్యాచరణ పైన బంజారాహిల్స్ లోని టిజిఐసిసిలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న సీపీ సజ్జనార్ ఆహార భద్రత విభాగం ఉన్నతాధికారులతో పాటు, పోలీసు ఉన్నతాధికారులతో ఆహార కల్తీ నియంత్రణ పైన చర్చించారు. కల్తీని కూకటివేళ్లతో తొలగించాలని పోలీసు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

hyderabad cp sajjanar serious warning and shock for food business people over food Adulteration

ఆహార కల్తీని చిన్న నేరంగా చూడకూడదు
ఆహార కల్తీని చిన్న నేరంగా చూడకూడదని, అది ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తుందని, వారి జీవితాలతో చెలగాటమాడుతుందని అన్నారు. దీనిని హత్యాయత్నంగానే పరిగణించాలని ఆయన గట్టిగా చెప్పారు. ప్రజారోగ్యాన్ని కాపాడటమే తమ ప్రధాన కర్తవ్యమని సజ్జనార్ పేర్కొన్నారు. కల్తీ ఆహారం తయారుచేసే మూల కేంద్రాల పైన, రోడ్డు పక్కన ఉండే చిరు వ్యాపారాలను చేసుకునేవారు కల్తీ చేసినా వారిపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆహార కల్తీపై కఠిన చర్యలకు ఆదేశం
దీనికోసం ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను రూపొందించి కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు.ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులు, చేపట్టవలసిన చర్యల పైన చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇక ఆహార కల్తీపై కఠినంగా వ్యవహరించే క్రమంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా పగడ్బందీగా వ్యవహరిస్తామని cp సజ్జనార్ పేర్కొన్నారు.

లైసెన్స్ లు రద్దు, కల్తీ మాఫియాపై పీడీ యాక్ట్
ఫుడ్ వ్యాపారం చేసే వారంతా నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక కల్తీ చేస్తూ పదేపదే దొరికితే, వారి వ్యాపారాల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయిస్తామని సజ్జనార్ హెచ్చరించారు. ప్రజారోగ్యానికి తీవ్ర హాని కలిగించే కల్తీ మాఫియా పైన పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపించడానికి కూడా వెనుకాడేది లేదని ఆయన తేల్చి చెప్పారు.

త్వరలో అందుబాటులోకి ప్రత్యేక వాట్సాప్ లేదా టోల్ ఫ్రీ నెంబర్
కల్తీ జరుగుతున్నట్టుగా అనుమానం వస్తే ప్రజలు కూడా వెంటనే స్పందించాలని మీరు సమాచారం అందించడానికి త్వరలోనే ప్రత్యేక వాట్సాప్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. సమాచారం ఇచ్చిన వివరాలను గోప్యంగా కూడా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+