అలా చేస్తే జైలుకే.. వారికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక!
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ట్రాన్స్ జెండర్ లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ట్రాన్స్ జెండర్ లు బలవంతపు వసూళ్లు చేస్తున్నారని, ప్రజల తోటి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారి ఆగడాల పైన ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన ట్రాన్స్ జెండర్ ల విషయంలో ఘాటుగా స్పందించారు. ఇకపై బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు.
ట్రాన్స్ జెండర్ లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
ఇటీవల సుమారు 250 మంది ట్రాన్స్ జెండర్ లతో అమీర్ పేటలోని సెస్ ఆడిటోరియంలో సమావేశం నిర్వహించిన హైదరాబాద్ సీపీ సజ్జనార్ ట్రాన్స్ టెండర్లు గౌరవప్రదంగా జీవించాలని సూచించారు. ప్రభుత్వం వారికి అందిస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఉపయోగించుకొని జీవితాన్ని సాగించాలన్నారు. సామాన్యులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. ఎక్కడైనా సరే బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన పునరుద్ఘాటించారు.

ట్రాన్స్ జెండర్ ల గ్రూప్ తగాదాలపై సీపీ సజ్జనార్
ట్రాన్స్ జెండర్ ల మధ్య గ్రూప్ తగాదాలు పెరిగిపోతున్నాయని, ఆధిపత్య పోరులో భాగంగా శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకసారి ప్రాణ నష్టానికి కూడా కారణం అవుతుందని సీపీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు కూడా ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తున్నాయని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
ప్రజల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్
పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగే సమయంలో ట్రాన్స్ జెండర్ ల ఇళ్లకు వెళ్లి ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారని పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, నేరస్తులను జైలుకు పంపడానికి కూడా వెనుకాడేది లేదని cp సజ్జనార్ స్పష్టం చేశారు.
ట్రాన్స్ జెండర్ ల కోసం ప్రైడ్ ప్లేస్ అనే ప్రత్యేక వ్యవస్థ
సిఐడి మహిళా భద్రత విభాగ అడిషనల్ ఏడిజిఈ చారు సిన్హా సమావేశంలో పాల్గొని ట్రాన్స్ జెండర్ లకు కీలక సూచనలు చేశారు. ట్రాన్స్ జెండర్ ల సమస్యల పరిష్కారానికి మహిళా భద్రతా విభాగంలో ప్రైడ్ ప్లేస్ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
ట్రాన్స్ జెండర్ ల సమస్యల పరిష్కారానికి విభాగం
ట్రాన్స్ జెండర్ లకు ఏ సమస్య వచ్చినా లేదా వేధింపులకు గురైనా వెంటనే ఈ విభాగాన్ని సంప్రదించాలని చారు సిన్హా స్పష్టం చేశారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు మహిళా భద్రత విభాగం ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుందని చారు సిన్హా హామీ ఇచ్చారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications