ఈ ఐసిస్ ఉగ్రవాది హైదరాబాద్ డాక్టర్: విషప్రయోగంతో టెర్రర్ ప్లాన్..!!

గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్(ATS) అరెస్టు చేసిన ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదుల్లో ఒకరు డాక్టర్‌ అని తెలిసిందే. అయితే వీరిని విచారణ చేయగా పలు దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు విచారణాధికారులు తెలిపారు. వైద్యుడిగా పనిచేసిన వ్యక్తి రిసిన్ అనే విషపూరితమైన పదార్థాన్ని తయారు చేశాడని విచారణాధికారులు తెలిపారు. అంతేకాదు దీన్ని ప్రయోగించేందుకు మూడు నగరాలను ఎంచుకుని అ్కడ అత్యంత రద్దీగా ఉన్న ఫుడ్ మార్కెట్లలో రెక్కీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్‌కు చెందిన ఉగ్రవాది డాక్టర్
పోలీసులు విచారణాధికారులు తెలిపిన వివరాల ప్రకారం రిసిన్ అనే ఈ విషపదార్థాన్ని తయారు చేసిన వ్యక్తి ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండి, అహ్మదాబాదులోని నరోడా ఫ్రూట్ మార్కెట్, లక్నోలోని ఆర్ఎస్ఎస్ ఆఫీసుల వద్ద ఆరు నెలల క్రితం రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్ తయారు చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాంతాలు నిత్యం ప్రజలతో రద్దీగా ఉంటాయి కాబట్టి నిందితుడు వీటిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదుకు చెందిన ఈ డాక్టర్ పేరు అహ్మద్ మోహియుద్దీన్ సయ్యద్. రిసిన్‌ను ఒక మారణాయుధంగా ఎలా తయారు చేయాలో అన్వేషించినట్లు తెలుస్తోంది. ఆముదం చెట్టు విత్తనాల నుంచి రిసిన్ అనే ప్రొటీన్‌ను ఆయుధంగా చేసుకుని దాడికి ఉపయోగించే మార్గాలను అన్వేషించినట్లు ఏటీఎస్ పేర్కొంది.

hyderabad-doctor-arrested-by-gujarat-ats-isis-terror-plot-planned-ricin-attack-at-food-markets

రిసిన్‌తో ముప్పు ఏంటి..?
రిసిన్ అనే విష పదార్థం ఆముదం మొక్క విత్తనాల నుంచి సేకరిస్తారు. అయితే రిసిన్‌‌తో విషప్రయోగం చేయడం చాలా అరుదని కేవలం విత్తనాలు తీసుకున్నప్పుడు మాత్రమే విషప్రయోగం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ విషం అధిక మోతాదులో తీసుకుంటే ప్రాణాంతకంగా మారొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే సకాలంలో వైద్యుడిని సంప్రదించి చికిత్స అందిస్తే ప్రాణాలకు ముప్పు తప్పుతుందని నిపుణులు వెల్లడించారు.

ATS పోలీసులు ఏం చెప్పారు..?
హైదరాబాద్‌కు చెందిన ఈ ఉగ్రవాది వైద్యుడు అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ రిసిన్ అనే విష పదార్థాన్ని తయారు చేశాడని, దీనికోసం అవసరమైన పరిశోధనలు కూడా చేసినట్లు ఏటీఎస్ వర్గాలు పేర్కొన్నాయి. దాడి చేసేందుకు పరికరాలు ముడిపదార్థాలు సేకరించి అవసరమైన ప్రాథమిక రసాయన చర్యను కూడా ప్రారంభించినట్లు గుజరాత్ ఏటీఎస్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. గుజరాత్ ఏటీఎస్ కేంద్ర బృందాలు స్వాధీనం చేసుకున్న ముడిసరుకు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల మూలాల గురించి విచారణ ప్రారంభించాయి. ఈ రసాయనాలు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే రిసిన్ విషపదార్థం ఎక్కడైన ప్రయోగించారా అనే కోణంలో కూడా కూపీ లాగుతున్నారు.

నిధులు సమీకరణ,దాడులకు ప్లాన్
ఇదిలా ఉంటే అరెస్టయిన్ ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదుల్లో ఇద్దరు ఉత్తర్ ప్రదేశ్‌కు చెందినవారు కాగా ఒకరు హైదరాబాదుకు చెందిన వ్యక్తి. గుజరాత్ ఏటీఎస్ కేంద్ర బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ ముగ్గురు అరెస్టు అయ్యారు. వీరికి పలు రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌లు ఉన్నాయని, స్లీపర్ సెల్స్ ద్వారా వీరు ఆపరేట్ చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇక హైదరాబాదుకు చెందిన ఉగ్రవాది సయ్యద్ చైనా నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందగా... ఐసిస్‌కు అనుబంధ సంస్థగా ఉన్న ఇస్లామిక్ స్టేట్ - ఖోరసన్ ప్రావిన్స్ కీలక సభ్యుడైన అబు ఖదీంతో‌ టచ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు చేయాలనే లక్ష్యంతో సయ్యద్ పనిచేస్తున్నాడని ఇతను బాగా చదువుకున్న వ్యక్తి అని ఏటీఎస్ వెల్లడించింది. వివిధ మార్గాల ద్వారా నిధులు సమీకరించడం, పలు ప్రధాన నగరాల్లో దాడులు నిర్వహించేందుకు మనుషులను రిక్రూట్ చేసుకోవడం ఇతనికి అప్పజెప్పిన పని అని విచారణలో వెల్లడైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+