Alert:హైదరాబాద్‌లో ఆ రోజు వాటర్ బంద్.. ముందుగానే డ్రమ్ముల్లో నీళ్లు నింపుకోండి..!!

ఇంకా వేసవికాలం రాకముందే హైదరాబాదులో తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీటి సరఫరా చేసే పైపులు దెబ్బతిన్నాయి. దీంతో పైపులకు మరమత్తులు చేసే పనిలో పడింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సివిరేజ్ బోర్డు (HMWSSB). ఈ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం హైదరాబాదులోని చాలా ప్రాంతాల్లో 24 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది.

కృష్ణా తాగునీటి సరఫరా ఫేజ్-3లో లీకేజీ ఉన్నట్లు అధికారులు గమనించారు. ఇక్కడి నుంచే నగరంలోని వివిధ ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేయబడుతోంది.వెంటనే ఈ లీకేజీలకు మరమత్తులు చేసేందుకు అధికారులు ఉపక్రమించారు. అక్టోబర్ 24 తేదీ ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 25 ఉదయం 6 గంటల వరకు నగరంలో చాలా ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని అధికారులు పేర్కొన్నారు.

Hyderabad Faces 24-Hour Water Supply Disruption Across Multiple Areas know where

ఇక మరమత్తుల కారణంగా హైదరాబాదులోని చాలా ప్రాంతాల్లో అంటే శాస్త్రిపురం, బండ్లగూడ, భోజగుట్ట, లాలాపేట్, మల్లికార్జున నగర్, శంషాబాద్, షేక్‌పేట్,జూబ్లీ హిల్స్, ఫిల్మ్‌నగర్ ప్రాంతాల్లో నీటిసరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న నివాసులు ముందుగానే తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. గత నెలలో అంటే సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు వివిధ పైప్‌లైన్ల మరమత్తులో భాగంగా వాటర్ సప్లయ్ నిలిపివేయడం జరిగిందన్న విషయాన్ని అధికారులు గుర్తు చేశారు.

సెప్టెంబర్‌లో HMWSSB విడుదల చేసిన ప్రకటన ప్రకారం కృష్ణ ఫేజ్-3 కింద ఉన్న ప్రధాన పైప్‌లైన్‌లో చాలా చోట్ల లీకేజీలు ఉన్నట్లు అధికారులు గమనించారు. ఈ పైపు లైన్ ద్వారా ప్రశాసన్ నగర్ నుంచి అయ్యప్ప సొసైటీకి వాటర్ సప్లయ్ జరుగుతుంది.ఇక ఆగష్టు నెలలో కూడా తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఆగష్టు 3వతేదీ రాత్రి 9 గంటల నుంచి ఆగష్టు 31వ తేదీ రాత్రి 9 గంటల వరకు నగరంలో పలు ప్రాంతాలకు వాటర్ సప్లయ్ నిలిచిపోయింది.

జూలై నెలలో పెద్దాపూర్, కంది సబ్‌స్టేషన్‌లో రిపేర్ల కారణంగా లిగంపల్లి, బోరబండ, షేక్‌పేట్ రిజర్వాయిర్, మణికొండ, నార్సింగి,మంచిరేవుల,మూసాపేట్ ప్రాంతాల్లో నీటి సరఫరా ఆగిపోయింది.ఇక ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, సోమాజీగుడా, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్ లాంటి ప్రాంతాల్లో చాలా తక్కువస్థాయిలో తాగు నీటి సరఫరా జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+