Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ ఫేమస్ చాట్.. గోకుల్ చాట్ యజమాని ముకుంద్ దాస్ మృతి!!

గోకుల్ చాట్.. హైదరాబాద్లో గోకుల్ చాట్ పేరు తెలియని వారు ఉండరు. ఇది చాలా ఫేమస్ అయిన చాట్ ప్లేస్. హైదరాబాద్ లోని కోటి సందర్శించిన ప్రతి ఒక్కరూ ఇక్కడ చాట్ తినకుండా వెళ్లరు అంటే అతిశయోక్తి కాదేమో! ఇక్కడి చాట్ అంతగా ఫేమస్ అయింది. అయితే 2007వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా గోకుల్ చాట్ పేరు మార్మోగింది. అందుకు కారణం అక్కడ ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడి.

2007వ సంవత్సరం ఆగస్టు 25వ తేదీన లుంబిని పార్క్, గోకుల్ చాట్ ప్రాంతాలు బాంబు మోతలతో దద్దరిల్లి పోయాయి. ఒక్కసారిగా గోకుల్ చాట్ వద్ద బాంబు పేలడంతో చాట్ తింటూ, తమ వారితో మాట్లాడుతున్న 33 మంది ప్రాణాలు కోల్పోయారు. అలా గోకుల్ చాట్ వద్ద ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎన్నో అనుబంధాలు, బంధాలు, రక్త సంబంధాలు ఉన్నాయి.

Hyderabad Famous Chat.. Gokul Chat Owner Mukund Das died!!

ఆనాడు గాయపడిన హృదయాలు ఇంకా నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ ఆ బాధను అనుభవిస్తూనే ఉన్నాయి. అత్యంత విషాదకరమైన ఈ ఘటనలో ఎంతోమంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన విషాదాన్ని మిగిల్చింది. ఇక తాజాగా మరోమారు గోకుల్ చాట్ పేరు వార్తల్లోకి వచ్చింది.

హైదరాబాద్ లో ఫేమస్ అయిన గోకుల్ చాట్ యజమాని ముకుంద దాస్ నిన్న మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 75 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన వయస్సు పెరిగిన రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న మరణించారు.

ఆయన అంత్యక్రియలను కూడా కుటుంబ సభ్యులు పూర్తిచేశారు. 1970 సంవత్సరంలో ఆయన గోకుల్ చాట్ ని ప్రారంభించారు. అప్పటినుండి ఇప్పటివరకు గోకుల్ చాట్ తన రుచితో అందరిని ఆకట్టుకుంటూనే ఉంది. ఇక ఆయన మరణం పట్ల పలువురు వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+