రీల్స్‌లో పరిచయమైన బాలికను.. పెళ్లి పేరుతో పిలిచి దారుణంగా చంపేశాడు!
వాళ్లిద్దరికీ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు అది ప్రేమగా మారింది. రీల్స్ చేసుకుంటూ ఒకరిపై ఒకరు ప్రేమను కొనసాగిస్తూ వచ్చారు. ఇంతలో ఆ పదిహేడేళ్ల బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఆ ప్రేమికుడు. రీల్స్‌లో అతడు చూపించిన ప్రేమను చూసి.. నిజ జీవితంలో అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాడని నమ్మింది. ఆలస్యం చేయకుండా ఇల్లు వదిలి అతడి కోసం వెళ్లిపోయింది. కోటి ఆశలతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ బాలిక శవమై మిగిలింది.
భాగ్యనగరంలోని మియాపూర్‌లో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో బాలికను ఇంటి నుంచి రప్పించిన ఓ యువకుడు అత్యాచారం చేసి, దారుణంగా చంపేశాడు. ఈ ఘనటకు సంబంధించి మియాపూర్ ఇన్‌స్పెక్టర్ క్రాంతి, ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌కు చెందిన ఓ బాలిక(17) ఇంటర్ పూర్తి చేసి, ఇంటోలోనే ఉంటోంది. కొన్ని నెలల క్రితం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉప్పుగూడకు చెందిన విఘ్నేశ్ అలియాస్ చింటూ(22)తో పరిచయం ఏర్పడింది. బ్యాండ్ వాయించే చింటూ ఆ బాలికను ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు. అతడి మాయమాటలను నమ్మిన బాలిక అక్టోబరు 20న ఇల్లు వదిలి ఉప్పుగూడలోని చింటూ దగ్గరకి వచ్చేసింది.

బాలికపై అనుమానంతో..
ఆమెను తీసుకుని ఛత్రినాకలో ఉన్న తన స్నేహితుడు సాకేత్ ఇంటికి చింటూ వెళ్లాడు. అయితే, సాకేత్‌కు కూడా పెళ్లి కావడంతో ఆ చిన్న ఇంట్లో వారంతా ఉండడం ఇబ్బందిగా మారింది. దీంతో వారంతా మీర్‌పేటలోని మరో అద్దె ఇంటికి మకాం మార్చారు. ఈ క్రమంలోనే చింటూ ఆ బాలికను పెళ్లిచేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు. ఆమె ఒత్తిడి చేయడంతో దండలు మార్చుకున్నారు. అయితే, పెద్దలను ఒప్పించి, అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. కానీ, చింటూ తాను లేని సమయంలో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వేరొకరితో మాట్లాడుతోందని అనుమానించారు. ఈ నెల 8న ఆమెతో గొడవకు దిగి, బాలిక తలను గోడకు కొట్టి కిరాతకంగా చంపేశాడు. స్నేహితుడు సాకేత్‌తో కలిసి మృతదేహాన్ని బైక్‌పై శ్రీశైలం జాతీయ రహదారిపై వెళ్లారు. తుక్కుగూడ సమీపంలో ప్లాస్టిక్ వ్యర్థాల పరిశ్రమ తుక్కులో ఎవరికి కనిపించకుండా చెత్తతో మృతదేహాన్ని కప్పేసి వెళ్లిపోయారు.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో..
అయితే, బాలిక తన స్నేహితులతో కలిసి ఉంటున్నానని తల్లికి ఫోన్‌లో చెబుతూ ఉండేది. ఘటన జరిగిన తర్వాత చింటూ నేరుగా ఆమె తల్లికి ఫోన్ చేశాడు. ఆమె తన దగ్గర లేదని, ఫోన్ కూడా పనిచేయడం లేదని చెప్పాడు. రెండు రోజులు గడిచినా బాలిక ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఈ నెల 10న మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు చింటూను అదుపులోకి తీసుకుని, విచారించగా హత్య విషయం వెలుగు చూసింది. బాలిక మృతదేహం తరలించేందుకు సహకరించిన సాకేత్‌తోపాటు అతని భార్య కల్యాణిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications