హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్ కు పోటెత్తిన దరఖాస్తులు.. నేడే ఆఖరు తేదీ, లాటరీ ఎప్పుడంటే!
తెలంగాణా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం చేపట్టింది. ఈ క్రమంలో స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకోవటానికి ఆర్ధిక సహాయం చేస్తూనే,స్థలం లేనివారికి అపార్ట్ మెంట్ లను నిర్మిస్తోంది. ఈక్రమంలో హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇళ్ళకు , ఇందిరమ్మ ఇళ్ళ టవర్స్ కు దరఖాస్తులను ఆహ్వానించింది తెలంగాణా ప్రభుత్వం. అయితే ఊహించని విధంగా భారీగా ఈ స్కీమ్ కు ప్రజల నుండి దరఖాస్తులు వెల్లువగా మారాయి.
హైదరాబాద్ ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తులకు నేడే చివరి తేదీ
హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి భారీగా అప్లై చేసుకుంటున్న ప్రజలు తమకు ఒక గూడు కోసం ప్రాంతాల వారీగా క్యూ కడుతున్నారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మించనున్న 7,340 ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే శనివారం నాటికి 35,125దరఖాస్తులు వచ్చాయని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ తెలిపారు.ఆగస్టు 10వతేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.

కేవలం 6 లక్షల రూపాయలకే దాదాపు 50 లక్షల దాకా విలువ చేసే ఫ్లాట్ లు
అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సందేహాలు ఉంటే 040-24603572 నంబరుకు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు.ఈ పథకం కింద మార్కెట్‌లో 30 నుంచి 58 లక్షల వరకు ఉండే ఫ్లాట్లను కేవలం 6 లక్షల రూపాయలకే ఇస్తున్నట్టు తెలిపారు. లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇస్తామని పేర్కొన్నారు. వారికి ప్రస్తుతం నివసిస్తున్న నియోజకవర్గంలోనే ఇల్లు పొందే అవకాశం ఉంటుందని కూడా ఆయన తెలిపారు.
ఇల్లు రాకుంటే ఆ పదివేలు తిరిగి ఇవ్వనున్న సర్కార్
దరఖాస్తు సమయంలో కుల, ఆదాయ సర్టిఫికెట్లు అవసరం లేదని, ఇల్లు కేటాయించకపోతే దరఖాస్తుతో పాటు ఇచ్చిన రూ.10,000 ధరావతు ఫీజు తిరిగి ఇస్తారని తెలిపారు.లాటరీ ప్రక్రియను ఆగస్టు 20వ తేదీ నుంచి ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు చెప్తున్నారు. నిర్మాణ పనుల కోసం టెండర్లు కూడా పిలిచారు.
లాటరీ ద్వారా కేటాయింపు, దరఖాస్తులు ఎక్కువ వచ్చింది ఇక్కడే
ఒకేసారి ఒక ఏడాది లోపు ఇళ్లను పూర్తి చేసి అందించే లక్ష్యంతో ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లనున్నారు. ఏరియాల వారీగా దరఖాస్తులను స్వీకరించి లాటరీలో వారికి కేటాయించనున్నారు. .
నియోజకవర్గాల వారీగా చూస్తే శనివారం వరకు కూకట్‌పల్లి లో 5,233 దరఖాస్తులు, ఖైరతాబాద్ లో 4,394, కుత్భుల్లాపూర్ లో 4,121 చొప్పున ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి.



Click it and Unblock the Notifications