లెక్క పక్కాగా.: హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాలపై కీలక భేటీ, రెడీగా ఉన్నారా? అంటూ జేపీ నడ్డా
హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలోనే దక్షిణాదిలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు, పార్టీ బలోపేతం, విజయం సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు ఆరు గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది.
ఈ కీలక భేటీకి దక్షిణాది బీజేపీ ముఖ్యనేతలంతా హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ నుంచి పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులంతా హాజరయ్యారు. ఉత్తరాదిన బలంగా ఉన్న పార్టీ దక్షిణాదిన బలోపేతం కాకపోవడానికి గల కారణాలపై లోతుగా విశ్లేషించారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన సమావేశంలో దక్షిణాది ఎజెండాను రూపొందించాలని నిర్ణయించారు.

ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారా? అని నేతలను నడ్డా ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9 ఏళ్ల చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని దిశా నిర్దేశం చేశారు. జాతీయ నాయకత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని నేతలకు స్పష్టం చేశారు. పలు రాష్ట్రాల అధ్యక్షుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పనితీరు అద్భుతంగా ఉందని ప్రశంసించినట్లు తెలిసింది.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కనీసం 170 పార్లమెంట్ సీట్లు రావాలన్నది బీజేపీ లక్ష్యంగా తెలుస్తోంది. ఈ భేటీ ఎంత పకడ్బందీగా జరిగిందంటే.. మీటింగ్‌తో సంబంధం లేని నాయకుల్ని గాని, మీడియాను గానీ పరిసరాల్లోకే రానివ్వలేదు. ఆదివారం రాత్రి నోవాటెల్ హోటల్‌లోనే బస చేయనున్న జేపీ నడ్డా.. సోమవారం ఉదయం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.
Visited the Ujjaini Mahankali Temple in Secunderabad on the auspicious occasion of Lashkar Bonalu. This festival represents the unique cultural heritage of Telangana.
— Jagat Prakash Nadda (@JPNadda) July 9, 2023
I prayed to Mahankali Ammavaru for the good health and prosperity of our countrymen & the progress of our… pic.twitter.com/hoEnxIDxg1
సమావేశానికి ముందు అంతకుముందు, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని జేపీ నడ్డా దర్శించుకున్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ప్రజలు బోనాలు ఉత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రజల ఆకాంక్షలను తీర్చాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications