హైదరాబాద్ మెట్రో రైలులో దారుణం..
హైదరాబాద్ మెట్రో రైలులో నిత్యం వేలమంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్య కారణంగా చాలామంది విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, చిరు వ్యాపారులు, టూరిస్టులు మెట్రోలోనే ప్రయాణిస్తుంటారు. రోజురోజుకూ మెట్రోలో ప్రయాణికుల రద్దీ పెరిగిపోతోంది. ఇక మెట్రో స్టేషన్ లో అడుగడుగునా భద్రత, సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. రైలు ఎక్కిన తర్వాత లోపల కూడా ప్రతి బోగీలో సీసీ కెమెరాలు దర్శనం ఇస్తూ ఉంటాయి. అయితే తాజాగా హైదరాబాద్ మెట్రో రైలులో అమానుషమైన ఘటన జరిగింది.
ఇటీవల బెంగళూరు మెట్రో రైలులో ఒక రైతును మెట్రో స్టేషన్ లోకి వెళ్లనివ్వకుండా అక్కడి సిబ్బంది అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అలాంటి ఘటనే మరొకటి హైదరాబాద్ మెట్రోలో జరిగింది. ఓ దివ్యాంగుడిని హైదరాబాద్ మెట్రో స్టేషన్ లోకి వెళ్లకుండా అడ్డుకుంది. లోపలికి వెళ్లనివ్వకుండా బయటే దాదాపు 4 గంటల సేపు అతడిని నిరీక్షించేలా చేసింది అక్కడి సిబ్బంది. బ్యాటరీ వీల్ ఛైరులో మెట్రోలో ప్రయాణించేందుకు సిబ్బంది అక్కడ నిరాకరించారు. ఈ విషయాన్ని బాధితుడు మిట్టపల్లి శివకుమార్ మెట్రో ఎండీకి ఫిర్యాదు చేశారు.
తాను స్పైనల్ మస్కులర్ అట్రోఫి అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని.. అందుకే బ్యాటరీ వీల్ ఛైరులో వచ్చినట్లు తెలిపారు. అయితే అక్కడి సిబ్బంది బ్యాటరీ వీల్ ఛైర్ కు అనుమతి లేదని ఆపేశారని పేర్కొన్నారు. అక్కడ మెట్రో సిబ్బంది చాలా ఇబ్బంది పెట్టారని పోలీసుల ఎదుట కూడా అవమానకరంగా మాట్లాడారని వాపోయారు. 4 గంటల పాటు అక్కడే ఉండిపోయేలా చేశారని.. మెట్రో సిబ్బంది నాకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటన చేసింది. నిమజ్జనం రోజున ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అందుకే మెట్రో రైలు సేవలను పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 6న ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు అన్ని మెట్రో స్టేషన్ల నుంచి రైళ్లు నడుస్తాయని అన్నారు.












Click it and Unblock the Notifications