బంజారాహిల్స్‌లో కారు బీభత్సం: ఢీకొట్టడంతో ఎగిరిపడి ఇద్దరు మృతి

హైదరాబాద్: నూతన సంవత్సరం రోజున నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఓ కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న మారుతి కారు.. రాయల్ టిఫిన్ సెంటర్ వద్ద డివైడర్ ను ఢీకొట్టి అదుపుతప్పింది.

ఆ తర్వాత రివర్స్ తిరిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరినీ బలంగా ఢీకొట్టింది. ఆపై అక్కడ నిలిపివున్న మరో రెండు కార్లను వెనుక నుంచి ఢీకొట్టి ఆగిపోయింది. కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు ఎగిరి కిందపడ్డారు. తీవ్రగాయాలు కావడంతో వారు మృతి చెందారు.

Hyderabad: road accident in Banjara Hills, two killed

ప్రమాదానికి కారణమైన కారులో మరో ఇద్దరు గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియాకు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు మద్యం సేవించి వాహనం నడిపినట్లు పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ఈ ప్రాంతంలో గతంలో కూడా పలు ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

లారీపైనుంచి ఆటోపై పడ్డ గ్రానైట్ రాయి: ముగ్గురు మృతి

మహబూబాబాద్ జిల్లా కురవి వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీలోని గ్రానైట్ రాయి ఆటోపై పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటోలో చిన్నగూడూరు మండలంలోని మంగూరిగూడెం నుంచి కురవికి నూతన సంవత్సర వేడుకల కోసం యువకులు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
లారీ మహబూబాబాద్ వైపు నుంచి మరిపెడ వైపు వెళ్తోంది.

కురవి వద్దకు రాగానే రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీపై ఉన్న గ్రానైట్ రాళ్లు ఆటోపై పడటంతో ఆటోలో ప్రయాణిస్తున్నవారు రాళ్ల కిందపడి మృతి చెందారు. గ్రానైట్ రాయి కింద పడిన మృతదేహాలను జేసీబీ సాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+