Yearender 2025: ఈ ఏడాది హైదరాబాద్ లో జరిగిన మేజర్ ఈవెంట్స్ ఇవే..

2025 ముగుస్తోంది. మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. అయితే ఈ ఏడాది హైదరాబాద్ మహానగరంలో చాలానే ఈవెంట్స్ జరిగాయి. ప్రపంచ పటంలో హైదరాబాద్ ను నిలబెట్టాయి. ప్రపంచ ప్రఖ్యాత కార్యక్రమాలను హైదరాబాద్ సైతం ఘనంగా నిర్వహించగలదని తెలిసింది. ఈ ఏడాది హైదరాబాద్ లో ఎన్నో ఈవెంట్స్ జరిగాయి. ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. ప్రతి హైదరాబాదీ ఈ వేడుకల్లో భాగస్వామ్యం అయ్యాడు. ఆ విశేషాలు ఓసారి చూస్తే..

మిస్ వరల్డ్ 2025..

ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలోని హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. 72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ నగరం తొలిసారిగా ఆతిథ్యం ఇచ్చింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ మహానగరం పేరు మారుమోగింది. దాదాపు నెల రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 108 దేశాల నుంచి సుందరీమణులు పాల్గొన్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ చార్మినార్, ఫలక్ నుమా ప్యాలెస్, రామప్ప దేవాలయం వంటి తెలంగాణలోని చారిత్రక ప్రాంతాలను సందర్శించారు. ఇక గ్రాండ్ ఫినాలేను మే 31, 2024న హైదరాబాద్‌ లోని హైటెక్స్ (HITEX) ఎగ్జిబిషన్ సెంటర్‌ లో నిర్వహించారు.

బతుకమ్మతో ప్రపంచ రికార్డు..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నడూలేని విధంగా ఈసారి బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. బతుకమ్మ పండుగ 2025లో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించింది. ఈ సారి 63.11 అడుగుల ఎత్తుతో అతిపెద్ద బతుకమ్మను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ లోని సరూర్‌ నగర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రికార్డును సాధించారు. ఈ రికార్డుతో తెలంగాణ సంస్కృతికి అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లు అయింది.

సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ పోటీలు..

గచ్చిబౌలి లోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్‌ స్టేడియంలో డిసెంబర్ 6న ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ పోటీలు జరిగాయి. ఈ ఈవెంట్ కి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హాజరై సందడి చేశారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం రేవంత్..సల్మాన్ ఖాన్‌ తో కలిసి రేసింగ్ వీక్షించారు. ఇక సూపర్‌ క్రాస్‌ రేసింగ్‌ తెలంగాణలో జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. రెండు రోజుల పాటు ఈ రేసింగ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం ఆరు జట్లకు సంబంధించిన 48 మంది రైడర్లు పాల్గొన్నారు.

హైదరాబాద్ లో మెస్సీ టూర్..

అర్జెంటీనా ఫుట్‌ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ.. GOAT (Greatest Of All Time) ఇండియా టూర్‌ లో భాగంగా డిసెంబర్ 13, 2025న హైదరాబాద్‌ లో పర్యటించారు. ఉప్పల్ స్టేడియంలో సరదాగా ఫుట్ బాల్ ఆడి యువతలో స్ఫూర్తిని నింపారు. మెస్సీ స్టేడియంలోకి అడుగుపెట్టడం నుంచి ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఎగ్జిబిషన్‌ ఫుట్‌బాల్ మ్యాచ్‌ లో సింగరేణి ఆర్ ​ఆర్​-9 టీమ్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి గోల్ సాధించి హైలైట్‌ గా నిలిచారు. అలా మెస్సీ హైదరాబాద్ టూర్ విజయవంతం అయింది.

Hyderabad Shines Global Hosting the 72nd Miss World Pageant

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ను రంగారెడ్డి జిల్లా మీర్‌ ఖాన్‌ పేట్ లో దాదాపు వంద ఎకరాల్లో నిర్మిస్తున్న ప్యూచర్ సిటీలో నిర్వహించారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ప్రత్యేక విజన్ డాక్యుమెంట్‌ ను ఆవిష్కరించారు. ఈ సమ్మిట్‌ కు 40కుపైగా దేశాల నుంచి దాదాపు 15 వందల మంది విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. ఇక ఈ సదస్సులో ఏకంగా రూ. 5,75,000 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు (ఎంఓయులు) కుదిరినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+